Elderberry : ఈ పండ్లు తినడం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుందని..వృద్ధాప్యం ఆగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. దాని బెరడును కాల్చడం ద్వారా, పైల్స్ చికిత్సలో కంజై నూనెతో పాటు బూడిదను ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులకు పాల వాడకం దివ్యౌషధంగా పనిచేస్తుంది. రింగ్‌వార్మ్ విషయంలో, తాజా పాలను ఆ ప్రదేశంలో పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. పచ్చి పండ్లకు మధుమేహాన్ని దూరం చేసే శక్తి ఉంది. కడుపు నొప్పి వస్తే 4 పండిన పండ్లు తింటే చాలు త్వరగా తగ్గిపోతుంది.
పూర్తిగా పెరిగిన పండ్లను పచ్చిగా, ఉడకబెట్టి, ఎండబెట్టి, తరువాత ఉపయోగించాలి. వీటిని నిల్వ చేయవచ్చు కూడా. దీని ఆకులు, బెరడును కషాయంగా ఉపయోగించినా మంచి ఫలితాలు ఉంటాయి. దీని మూలాన్ని అనేక రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించుకోవచ్చు కూడా.
అయితే ఈ మేడి పండును ఇంగ్లీషులో ఇండియన్ ఫిగ్ అని పిలుస్తారు. మేడి పండు చూడు మెలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులుండు..అని విన్నారు కదా. ఈ పండు పండు గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు చాలా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఎన్నో సమస్యలను నివారించేందుకు ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.
పండ్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఫైల్స్ చికిత్సలో, చర్మ వ్యాధులకు, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, క్యాన్సర్‌ను నివారించడంలో చాలా ఉపయోగపడతాయి మేడి పండ్లు. ఈ పండు తిన్నా ఈ చెట్టు ఆకులు, బెరడును కషాయంగా తీసుకున్నా కూడా పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. టీబీ వంటి ప్రాణాంతక వ్యాధిని కూడా తగ్గించడంలో మేడి పండు సహాయం చేస్తుంది.. గొంతు, ఛాతీకి సంబంధించిన సమస్యలను కూడా దీని కషాయం నయం చేస్తుంది.
శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అయితే దీనికోసం మేడి పండు చెట్టు బెరడు కషాయం అద్భుతంగా పని చేస్తుంది అంటున్నారు నిపుణులు. నీళ్ల విరేచనాలు, ఛాతీ సంబంధిత వ్యాధులు, కామెర్లు నయం చేయడంలో కూడా సహాయ పడుతుంది మేడి పండుల. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తుంటారు.