Dhanteras 2024: భారతదేశంలో బంగారానికి విలువ ఎక్కువ. కాసింత బంగారం అయినా సరే శరరం ఉంచుకోవాలని అనుకుంటారు. మహిళలు రకరకాల ఆభరణాలు ధరిస్తారు. బంగారం ఎంత ఉత్పత్తి అవుతున్నా.. దిగుమతి చేసుకుంటున్నా.. అంతకు మించిన డిమాండ్ ఉంటోంది. రోజురోజుకు బంగారం విలువ పెరగడమే గానీ తగ్గడం లేదు. అయితే బంగారంను భారతీయులు ఒక లోహంగా మాత్రమే కాకుండా దేవతగా.. అదృష్ట సంపదగా కొలుస్తారు. కొందరు బంగారం ను లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే వివాహ సమయంలో మహిళలకు మంగళ సూత్రంను బంగారంతో చేయించి మెడలో వేస్తారు. వీటితో పాటు వివిధ అవయవాలకు ఆభరణాలు ధరిస్తారు. అయితే బంగారం నకు ఓ రోజు ప్రత్యేకంగా అంది. అదే దంతేరాస్. ప్రతీ సంవత్సరం దీపావళి ముందు వచ్చే దంతేరాస్ రోజును కొంచమైనా బంగారం కొనాలని అనుకుంటారు. అయితే బంగారంతో పాటు మరో వస్తువు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందిన అంటున్నారు. ఇంతకీ ఆవ వస్తువు ఏదో తెలుసా?
మహాలక్ష్మీ అనుగ్రహం ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి సంపదనుసృష్టిస్తుంది. అధిక ఆదాయం వచ్చేలా దీవిస్తుంది. దీంతో డబ్బు సంపాదించాలనుకునేవారు లక్ష్మీదేవిని నిత్యం కొలుస్తూ ఉంటారు. అయితే సాధారణ రోజుల్లో కంటే దంతేరాస్ రోజున అమ్మవారిని పూజించడం వల్ల ఎన్నో శుభాలు జరుగుతాయని అంటారు. అదువల్ల వ్యాపారులు నిర్వహించుకునే చాలా మంది ఈరోజున ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పూజలతో పాటు పిసిరంత బంగారం అయినా కొనుగోలు చేస్తారు. దీంతో ఈరోజున బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. ఎంత ధర ఉన్నా.. ఈరోజు బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతూ ఉంటారు.
లక్ష్మీదేవి కేవలం బంగారంలో మాత్రమే కాకుండా వివిధ వస్తువుల్లో కొలువై ఉంటుందని కొందరు పండితులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇళ్లల్లో ఉండే కొన్ని వస్తువులను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని అంటుంటారు. వీటిలో చీపురు చాలా ముఖ్యమైనది. ఇంట్లని చెత్తను శుభ్రం చేయడానికి చీపురును ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఈ చీపురు లక్ష్మీదేవికి ప్రతిరూపం అని చాలా మంది అంటుంటారు. చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొనరాదు. శుక్రవారం కొనడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవిని తీసుకు వచ్చినట్లు వుతుందని అంటుంటారు. అలాగే శనివారం చీపురును కొనడం వల్ల అన్నీ నష్టాలే ఉంటాయని భావిస్తారు.
అయితే దీపావళికి ముందు వచ్చే దంతేరాస్ రోజున బంగారంతో పాటు కొత్త చీపురును కొనుగోలు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని అంటున్నారు. దంతేరాజ్ ప్రతీ ఏడాది దీపావళి కంటే రెండు రోజుల ముందు వస్తుంది. ఈరోజుతో దీపావళి పండుగ ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 31న నిర్వహించుకోనున్నారు. అంతకంటే రెండు రోజుల ముందు అంటే అక్టోబర్ 29న దంతేరాస్ వేడుకలను నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా బంగారంతో పాటు చీపురును కొనుగోలు చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయంటున్నారు.
అయితే ఈరోజు ఇప్పటికే ఇంట్లో చీపురు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా చీపురును కాలి కింద పడకుండా చూసుకోవాలని అంటున్నారు. ఒకవేళ తగిలితే తన తప్పును క్షమించమని లక్ష్మీదేవిని ప్రార్థించాలని చెబుతున్నారు.