https://oktelugu.com/

Siri Lella: నారా రోహిత్ భార్య ‘సిరి లెల్ల’ కి జబర్దస్త్ కమెడియన్ ‘బాబు’ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొనక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఇదంతా పక్కన పెడితే సిరి లెల్ల కి జబర్దస్త్ కమెడియన్ బాబు కి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న రిలేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జబర్దస్త్ షోలోకి వచ్చేముందు 'బాబు' షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండేవాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 03:49 PM IST

    Siri Lella(1)

    Follow us on

    Siri Lella: ప్రముఖ హీరో నారా రోహిత్ నిన్న హైదరాబాద్ లో యంగ్ హీరోయిన్ సిరి లెల్ల తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సోషల్ మీడియా లో నెటిజెన్స్ సిరి లెల్ల గురించి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. కానీ ఆమె గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. ఈమె నారా రోహిత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ప్రతినిధి 2’ లో హీరోయిన్ గా నటించింది. అంతకు మించి ఆమె గురించి ఎలాంటి వివరాలు నెటిజెన్స్ కి దొరకలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమించుకున్నారు. నిన్న అట్టహాసంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం తో పాటు, నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా హాజరైంది. అలాగే ఇండస్ట్రీ నుండి నారా రోహిత్ కి అత్యంత సన్నిహితుడైన శ్రీ విష్ణు వంటి వారు కూడా ఈ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొన్నారు.

    కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొనక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఇదంతా పక్కన పెడితే సిరి లెల్ల కి జబర్దస్త్ కమెడియన్ బాబు కి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న రిలేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జబర్దస్త్ షోలోకి వచ్చేముందు ‘బాబు’ షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండేవాడు. అలా ఆయన సిరి లెల్ల తో ‘తొలిచూపులోనే’ అనే షార్ట్ ఫిల్మ్ చేసాడు. పదేళ్ల క్రితం ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యింది. దానికి సంబంధించిన ట్రైలర్ ని మీరు క్రింద చూడవచ్చు. అలా జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ టీం లో చిన్న క్యారక్టర్ రోల్స్ చేసుకునే బాబు, ఏకంగా నారా రోహిత్ కాబోయే సతీమణి తో అప్పట్లో షార్ట్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించాడా అని నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.

    సిరి కేవలం ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్ మాత్రమే కాదు అప్పట్లో చాలానే చేసింది. అందం, అభినయం ఉన్నప్పటికీ కూడా ఈమెకు ఎందుకో సినిమాల్లో ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు. ఇక నారా రోహిత్ విషయానికి వస్తే విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన చేసిన సినిమాలలో కమర్షియల్ హిట్స్ సాధించినవి చాలా తక్కువే, అయినప్పటికీ కూడా కొత్త తరహా కథలు చేయడంలో ముందు ఉంటాడు అనే పేరు నారా రోహిత్ కి వచ్చింది. ఈయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘సుందరకాండ’ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది.