Body Odor: ఎండాకాలం వచ్చిందంటే ఎండతోని ఏ విధంగా ఇబ్బంది పడుతుంటారో.. శరీర దుర్వాసనతో కూడా అదే విధంగా ఇబ్బంది పడుతుంటారు. కొన్ని సార్లు ఈ శరీర వాసన తట్టుకోలేక పక్కన ఉన్నవారు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఇది అర్థం అయితే చాలా బాధ అనిపిస్తుంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి సెంట్లతో కవర్ చేయాలని చూస్తారు. కానీ వీటి స్మెల్ నచ్చిన వారు కూడా ఉంటారు. అయితే ఈ చెమట స్మెల్ ఎందుకు వస్తుంది? పోవాలంటే ఏం చేయాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరం నుంచి వచ్చే దుర్వాసనకు కారణం మన శరీరం మీద ఉండే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అపోక్రిన్ గ్రంథులు చెమట రూపంలో విడుదల చేసే కొవ్వు, ప్రోటీన్ లను తింటాయి. ఇవి చెమట సమ్మేళనాలను అసహ్యకరమైన వాసనగా మారుస్తుంది. చెడు ఆహారం, జన్యుపరమైన కారణాలు, పెరుగుతున్న వయసు, పరిశుభ్రత లేకపోవడం వంటి కారణాల వల్ల శరీరం నుంచి స్మెల్ వస్తుంటుంది. దీని కోసం ఇప్పుడు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో చూసేయండి.
7 నుంచి 8 టమాటాలను తీసుకొని మెత్తగా రుబ్బి వడకట్టండి. పిప్పి నుంచి రసాన్ని వేరు చేయండి. ఈ టమాట రసాన్ని స్నానం చేసే వాటర్ లో కలిపి స్నానం చేయండి. దీనివల్ల చర్మం పై బ్యాక్టీరియా మనుగడ సాగడం కష్టం. టమాట స్నానం వల్ల దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా పెరుగుదల నశిస్తుంది. క్రమంగా చెమట వాసన తగ్గుతుంది. ఎర్ర ముల్లంగులను తీసుకొని దానికి మెత్తగా తరిగిన టర్నిప్ ను జోడించండి. వీటిని జల్లెడ పట్టి ఈ రసాన్ని కూడా శరీరానికి అప్లై చేయండి. ఆ తర్వాత శరీరానికి రాస్తే స్మెల్ పోతుంది.
వెనిగర్ నింపి ఆ కాటన్ బాల్స్ ను వాసన వచ్చే ప్రదేశంలో రుద్దండి. చర్మ వాతావరణాన్ని సాధారణంగా చేయడమే కాదు పీఎచ్ ని కూడా తగ్గిస్తుంది. వెనిగర్ అధిక ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి వాసనను ఉత్పత్తి చేసే చర్మానికి దీన్ని ఉపయోగిస్తే దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా నశిస్తుంది. అయితే ఈ రెమెడీస్ రోజుకు రెండు సార్లు చేస్తే శరీర దుర్వాసన ఇట్టే తొలగిపోతుంది.