https://oktelugu.com/

Pushpa 2: పుష్ప ను చూసి భయపడుతున్న బాలీవుడ్

అజయ్ దేవ్ గణ్ ప్రధాన హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ వంటి టాప్ హీరోలు నటిస్తున్నారు. అలాగే కరీనా కపూర్, దీపికా పదుకొనె హీరోయిన్స్.

Written By:
  • S Reddy
  • , Updated On : April 12, 2024 / 03:02 PM IST

    Bollywood is afraid of Pushpa 2

    Follow us on

    Pushpa 2: ఒకపక్క బాలీవుడ్ బడా స్టార్స్ కలిసి నటించిన మల్టీస్టారర్ సింగం అగైన్… మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2. అయినప్పటికీ సౌత్ హీరో అల్లు అర్జున్ దెబ్బకు నార్త్ స్టార్స్ భయపడ్డారనే టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 కి ఎదురెళ్ళడం రిస్క్ అని భావించిన సింగం అగైన్ మేకర్స్ విడుదల వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దర్శకుడు రోహిత్ శెట్టి సింగం సిరీస్ లో ఐదవ చిత్రంగా సింగం అగైన్ టైటిల్ తో యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు.

    అజయ్ దేవ్ గణ్ ప్రధాన హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ వంటి టాప్ హీరోలు నటిస్తున్నారు. అలాగే కరీనా కపూర్, దీపికా పదుకొనె హీరోయిన్స్. లెక్కకు మించిన స్టార్ క్యాస్ట్ తో భారీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల చేయాలని భావించారు. అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇదే తేదీనా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదల కానుంది.

    మొదట్లో సింగం అగైన్ కి ఎదురెళ్ళడం అల్లు అర్జున్ కే నష్టం అని భావించారు. అయితే ఆ మూవీపై ఉన్న హైప్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన టీజర్ గూస్ బంప్స్ లేపింది. నార్త్ ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి పుష్ప 2 పై నెలకొని ఉంది. ఈ క్రమంలో పుష్ప 2కి పోటీగా సింగం విడుదల చేయడం సరికాదని మేకర్స్ ఆలోచనలో పడ్డారట. పోస్ట్ ప్రొడక్షన్ కాలేదని సాకు చూపుతూ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.

    సింగం అగైన్ ని దీపావళికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంత మంది లోకల్ స్టార్స్ భాగమైన సింగం అగైన్ మేకర్స్ పుష్ప 2 కి భయపడటం ఊహించని పరిణామం. అల్లు అర్జున్ క్రేజ్ కి ఇది నిదర్శనం. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్. ముఖ్యంగా నార్త్ ఇండియాలో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప హిందీ వెర్షన్ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. పుష్ప 2లో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.