
మనలో చాలామంది ఆహారాన్ని వేగంగా తీసుకుంటూ ఉంటారు. అయితే వేగంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉరుకులపరుగుల జీవితంలో భోజనాన్ని తినడానికి కూడా సరైన సమయం లేక వేగంగా భోజనాన్ని పూర్తి చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వేగంగా భోజనం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
వేగంగా భోజనం చేసేవాళ్లు సాధారణంగా తినాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారు. అవసరం అయిన మోతాదు కంటే ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్లు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా నమలకుండా ఆహారాన్ని తీసుకునే వాళ్లకు జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. అందువల్ల ఆహారాన్ని నమిలి తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.
ఆహారం వేగంగా తినే వారిలో కడుపులో ఉబ్బరం సమస్య రావడంతో పాటు భవిష్యత్తులో వాళ్లను డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. వేగంగా ఆహారం తీసుకునే వాళ్లకు ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఉంటుంది. వేగంగా భోజనం చేసేవాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా నమిలి తింటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన పెద్దవాళ్లు సైతం నిదానంగా భోజనం చేయాలని చెబుతూ ఉంటారు. వేగంగా భోజనం చేయడం శరీరానికి మంచి కంటే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు వేగంగా భోజనం చేసిన వాళ్లు సైతం తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిది.