సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ 80 మెడికల్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
జూన్ 4, 5 తేదీలలో ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 80 ఉద్యోగ ఖాళీలలో స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా జీడీఎంవో ఉద్యోగ ఖాళీలు 16, స్టాఫ్ నర్సు ఉద్యోగ ఖాళీలు 31, హాస్పిటల్ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 26, ఫార్మాసిస్ట్ ఉద్యోగ ఖాళీలు 2, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ ఖాళీ 1, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 1 ఉంది.
సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్ డిగ్రీ, పీజీ/డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగాలకు అర్హులు. 53 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా నెలకు 95,000 రూపాయలు వేతనం చెల్లిస్తారు. ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వాళ్లు జీడీఎంవో ఉద్యోగాలకు అర్హులు.
53 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లకు నెలకు 75,000 రూపాయల వేతనం లభిస్తుంది. బీఎస్సీ(నర్సింగ్)/నర్స్ మిడ్‌వైఫరీలో సర్టిఫికేట్ ఉండటంతో పాటు 20 నుంచి 33 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు నర్సింగ్ సూపరిండెంట్ ఉద్యోగాలకు అర్హులు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి తుది ఎంపిక జరుగుతుంది.