దేశంలో చాలామంది కరోనా వైరస్ విజృంభణ తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా మెడిసిన్ లను వినియోగిస్తున్నారు. పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు, ఇతర కారణాల వల్ల వచ్చిన సమస్యలకు సైతం చాలామంది మెడిసిన్‌లు వాడుతున్నారు. అయితే మెడిసిన్‌లు వాడేవాళ్లలో చాలామంది పలు కీలకమైన విషయాలను మరిచిపోతున్నారు. కొన్ని మెడికల్ దుకాణాలు ప్రజలకు గడువు తేదీ ముగిసిన టాబ్లెట్స్‌ను ఇస్తున్నాయి.
అలాంటి టాబ్లెట్స్ ను పొరపాటున వేసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తగ్గకపోగా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఎక్కువ సంఖ్యలో టాబ్లెట్స్ కొని ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. మన ఇంట్లో ఉంచిన మందులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే మంచిది. గడువు ముగిసిన మందులు వాడితే ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
ఏదైనా మెడిసిన్‌ను కొనుగోలు చేస్తే ఆ మెడిసిన్ ప్యాక్ పై తయారీ డేట్ తో పాటు ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. ఔషధం తన ప్రభావాన్ని కోల్పోయే తేదీని ఎక్స్‌పైరీ డేట్ అని మెడిసిన్ శరీరంపై ప్రభావం చూపించలేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. వేడి, సూర్యరశ్మి, తేమ, అనేక ఇతర అంశాలు కూడా ఔషధాల శక్తిని ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎక్స్ పైరీ డేట్ అయిన మందులను వాడకూడదు.
మెడిసిన్ కంపెనీలలో ఎక్కువ కంపెనీలు మెడిసిన్ ఎక్స్ పైరీ డేట్ కంటే 6 నెలల మార్జిన్ వ్యవధిని ఉంచుతాయి. అంటే జనవరి 2022లో మెడిసిన్ ఎక్స్ పైరీ అయితే ఎక్స్ పైరీ డేట్ ను జులై 2021గా ఉంచుతాయి. ఇలా చేయడం వల్ల గడువు ముగిసిన కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి తెలియకుండా ఆ మెడిసిన్‌ను సేవించినా హాని కలగదు. ఎక్స్ పైరీ డేట్ ముగిసిన మెడ్సిన్స్ వాడితే తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.