https://oktelugu.com/

Macadamia Nuts : మకాడమియా నట్స్ తింటే.. అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు

మకాడమియా నట్స్ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మనలో చాలా మందికి ఈ నట్స్ గురించి తెలీదు. చాలా అరుదుగా దొరికే.. ఈ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మరి చూద్దాం.

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2024 8:07 pm
    Macadamia Nuts

    Macadamia Nuts

    Follow us on

    Macadamia Nuts : ఆరోగ్యంగా బలంగా ఉండాలని చాలా మంది నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తింటారు. అయితే అందరికీ ఎక్కువగా బాదం, జీడిపప్పు వంటివి మాత్రమే ఎక్కువగా తెలుసు. అయితే ఇలా ఎండ పెట్టిన వాటిలో చాలా రకాల నట్స్ ఉన్నాయి. అందులో మకాడమియా నట్స్ ఒకటి. వీటిని డైలీ తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫిట్ గా ఉండాలని ఎక్కువ మంది పిస్తా వంటివి తింటారు. అయితే మకాడమియా నట్స్ లో చాలా పోషకాలు ఉన్నాయి. రోజుకి ఒక ఐదు మకాడమియా నట్స్ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మనలో చాలా మందికి ఈ నట్స్ గురించి తెలీదు. చాలా అరుదుగా దొరికే.. ఈ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మరి చూద్దాం.

    జీడిపప్పు కంటే మకాడమియా నట్స్ లో ఎక్కువగా పోషకాలు, కేలరీలు ఉంటాయి. వంద గ్రాముల మకాడమియా నట్స్ లో 740 కేలరీలు ఉంటాయి. రోజుకి కనీసం నాలుగు నట్స్ తినడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. ఇందులో ఎక్కువగా శరీరానికి ఉపయోగపడే కొవ్వులు మాత్రమే ఉంటాయి. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్ వ్యాధి తగ్గుతుంది. అలాగే నీరసం, బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిని తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. దీంతో ఎలాంటి చిరు తిండ్లు తినాలన్న ఆసక్తి కూడా తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వల్ల వరకు అందరు కూడా వీటిని తినవచ్చు. వీటిని తినడం వల్ల అధిక రక్త పోటు, పక్షవాతం వంటి సమస్యలు కూడా రావు. చక్కెర స్థాయిలు పెరగకుండా.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వీటిని నానబెట్టి మాత్రమే తినాలి. పచ్చిగా అసలు తినకూడదు. తింటే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    మకాడమియా నట్స్ చాలా తక్కువగా దొరుకుతాయి. వీటిని కేవలం స్నాక్స్ గా తినడం మాత్రమే కాకుండా.. బ్రేక్ ఫాస్ట్ గా కూడా తినవచ్చు. ఈ మకాడమియా నట్స్‌లో ఒమేగా ఆమ్లాలు, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు వంటివి ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా సాయపడతాయి. కాబట్టి రోజుకి కొన్ని మకాడమియా నట్స్ అయిన తింటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారు. జీడిపప్పు, పిస్తాలా వీటిని కూడా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.