Women’s Daily Diet : మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. డైలీ డైట్ లో ఈ ఆహార పదార్థాలు చేర్చుకోవాల్సిందే!

ఎంత బిజీగా ఉన్నా మహిళలు ఆహార విషయంలో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కుటుంబ పనుల వల్ల చాలా మంది మహిళలు ఒక పూట తింటే మరొక పూట తినడం మానేస్తున్నారు. ఇలాంటి వాళ్లు డైలీ కొన్ని పదార్థాలను తీసుకోవాలి. మరి మహిళలు రోజూ వాళ్ల డైట్ లో చేర్చుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో మరి చూద్దాం.

Written By: Neelambaram, Updated On : September 10, 2024 8:11 pm

Women's Daily Diet

Follow us on

Women’s Daily Diet : కుటుంబ బాధ్యతలు, ఇంట్లో పని, ఆఫీస్ వర్క్ లలో బిజీగా ఉండి మహిళలు ఆరోగ్యంపై అశ్రద్ధ పెడతారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది మహిళలు ఈరోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమవుతున్నారు. అయితే ఈరోజుల్లో ఎక్కువ మంది మహిళలు గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటివి కూడా మహిళలను వేధిస్తున్నాయి. ఎంత బిజీగా ఉన్నా మహిళలు ఆహార విషయంలో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కుటుంబ పనుల వల్ల చాలా మంది మహిళలు ఒక పూట తింటే మరొక పూట తినడం మానేస్తున్నారు. ఇలాంటి వాళ్లు డైలీ కొన్ని పదార్థాలను తీసుకోవాలి. మరి మహిళలు రోజూ వాళ్ల డైట్ లో చేర్చుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో మరి చూద్దాం.

వేర్లు ఉండే కూరగాయలు
దుంప జాతి అయిన బీట్ రూట్, క్యారట్, ముల్లంగి, చిలగడ దుంప వంటివి మహిళలు రోజువారీ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి మేలు చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పొటాషియం, ఫొలేట్, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్ చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటంలో ఉపయోగపడతాయి.

పసుపు
యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పని చేసే పసుపును మహిళలు తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో ఉండే కర్కుమిన్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, అల్జీమర్స్, క్యాన్సర్ వంటివి రాకుండా కాపాడుతుంది. కాబట్టి మహిళలు పసుపుని తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలి.

సొయాబీన్స్
వీటిలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎలాంటి గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, కరోనరీ హార్ట్ డిసీజ్, వంటివి రాకుండా కాపాడుతుంది. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

పండ్లను చేర్చుకోవాలి
మహిళలు రోజువారీ డైట్ లో తప్పకుండా మఖానా, అత్తి పండ్లు, ఖర్జూరం, బాదం, పిస్తా వంటివి తప్పకుండా చేర్చుకోవాలి. అలాగే గుమ్మడి, పొద్దు తిరుగుడు గింజలు కూడా చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

పెరుగు తినడం
రోజుకి ఒకసారి అయిన పెరుగు తినడం వల్ల మహిళల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. పాలు, పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు, పేగుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జీర్ణ క్రియ కూడా సరిగ్గా పనిచేస్తుంది. అయితే పెరుగు తినని వాళ్లు మజ్జిగ చేసుకుని కూడా తాగవచ్చు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.