Egg: కోడిగుడ్డు అంటే ఇష్టం లేనివారు ఉంటారా? ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్డు, లేదా పచ్చి గుడ్డును తాగడం అయినా చేస్తుంటారు చాలా మంది. జిమ్ కు వెళ్లేవారికి వరం కోడిగుడ్డు. అయితే ప్రతి రోజు ఒక గుడ్డు తినాలి అంటారు వైద్యులు. ఇందులో ఉంటే ప్రోటీన్లు, విటమిన్లు చాలా వరకు ఉపయోగపడుతాయి. అందుకే రోజు గుడ్డు తినే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. అయితే కొన్ని వ్యాధులతోటి బాధ పడేవారు మాత్రం గుడ్డుకు దూరంగా ఉండాలట. ఇంతకీ ఎవరు దూరంగా ఉండాలంటే.
అన్ని పోషకాల ఉండే ఆహారం ఏంటంటే ఠక్కున గుడ్డు పేరు గుర్తుకు వస్తుంది. ప్రోటీన్లు మాత్రమే కాదు ఇతర విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. కాల్షియం తో పాటు ఇతర మినరల్స్ కూడా ఉంటాయి ఈ కోడిగుడ్లులో.. అందుకే ఎగ్ మస్ట్ ఫర్ ఎవ్రీవన్ అంటారు వైద్యులు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ కోడిగుడ్లను స్కిప్ చేయాల్సిందే. లేదంటే వ్యాధులు మరింత బలపడే అవకాశం ఉంటుందట.
అధిక ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, ఊబకాయం, అరుగుదల సమస్య, గుండె వ్యాధులు, డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు ఎగ్ ను తినకపోవడమే బెటర్. దీని వాడకం పూర్తిగా తగ్గించాలి. అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న గుడ్లు అరుగుదలకు చాలా సమయం పడుతుందట. అంతేకాదు పచ్చసొనతో కొలెస్ట్రాల్ సమస్యలు కూడా పెరుగుతాయి. గుండె కండరాల్లో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది అంటున్నారు వైద్యులు. అందుకే కొన్ని వ్యాధులు ఉన్నవారు ఈ గుడ్లను తినకుండా ఉండండి.
పోట్రీన్లు, విటమిన్లు, మినరల్స్ లభించే ఆహారపదార్థాలు చాలా ఉంటాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకొని తినడం వల్ల మీకు కావాల్సిన ప్రోటీన్లు లభ్యమవుతాయి. మరి ఒకసారి గుడ్డును స్కిప్ చేసే ముందే మీ వైద్యుడి సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.