https://oktelugu.com/

Anushka: అనుష్క రియల్ క్యారెక్టర్ ఇదా? షాకింగ్ విషయాలు చెప్పిన మేకప్ మ్యాన్!

' మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆమె క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ' ఘాటీ ' అనే సినిమా చేస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 12, 2024 / 02:30 PM IST

    Makeup man said shocking things about Anushka

    Follow us on

    Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. యూత్ లో ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత అనుష్క రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. బాహుబలి పార్ట్1 లో డీ గ్లామరస్ రోల్ లో కనిపించిన అనుష్క .. పార్ట్ 2 లో దేవసేన గా తన అందంతో ప్రేక్షకులను మైమరపించింది. బాహుబలి 2 తర్వాత అనుష్క సినిమాల సంఖ్య తగ్గించింది. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది.

    గత ఏడాది ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆమె క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘ ఘాటీ ‘ అనే సినిమా చేస్తుంది. దీంతో పాటు మలయాళంలో ‘ కధనార్ ‘ అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో అనుష్క మెయిన్ లీడ్ అని తెలుస్తుంది. అనుష్క ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలకంటే కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.

    ఇది ఇలా ఉండగా తాజాగా అనుష్క గురించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనుష్క వ్యక్తిత్వం, మనస్తత్వం ఎటువంటిది? ఆఫ్ స్క్రీన్ లో ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో? ఆమె దగ్గర పని చేసిన మేకప్ మ్యాన్ వెల్లడించారు. అయితే సినిమాలో డైనమిక్ పాత్రలు చేసిన అనుష్క నిజ జీవితంలో చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తట. ఎవరికైనా సమస్య వస్తే తన సమస్యగా భావించి బాధపడతారట.

    ఆమెకు దయా గుణం చాలా ఎక్కువట. పైగా డబ్బుల విషయంలో నిర్మాతలను అనుష్క అసలు ఇబ్బంది పెట్టరట. ఎవరినీ నొప్పించదని .. ఎవరికైనా కష్టం వస్తే సాయం చేసే గొప్ప గుణం అనుష్క కి ఉందని మేకప్ మ్యాన్ అన్నారు. తాము చాలా మంది హీరోయిన్లను చూసాము. కానీ అనుష్కలోని గొప్ప మనస్తత్వం, మంచి గుణాలు ఇతర హీరోయిన్స్ లో లేవని మేకప్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.