Chiranjeevi: ప్రస్తుతం సీనియర్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ విషయం లో అందరికంటే ముందుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం సినిమాల వేగాన్ని పెంచినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ప్రతి సంవత్సరంలో రెండు సినిమాలను రిలీజ్ చెయడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక అందువల్లే తను కొంచెం కూడా ఖాళీ లేకుండా ఈ సినిమా కోసమే తన పూర్తి ఎఫర్ట్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఆయన ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆయన చేసిన ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుడి కండ్ల ముందు అలా కదలాడుతూ ఉంటుంది అంటే ఆయన ప్రేక్షకుడిని ఎంతలా మైమరిపింపచేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యం తో చిరంజీవి కష్టపడుతూ డైరెక్టర్ ను కూడా విపరీతంగా కష్టపెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన గత సినిమా అయిన భోళా శంకర్ సినిమా సరైన సక్సెస్ సాధించకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఇక భోళా శంకర్ సినిమాలో చేసిన చాలా మిస్టేక్స్ వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ మిస్టేక్స్ ని తెలుసుకొని ఈ సినిమాలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే విశ్వంభర సినిమా కోసం దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ ని పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే దాదాపు 40 కోట్లు పెట్టి ఒక సెట్ కూడా వేశారట. అయితే ఈ సినిమాలో ఉన్న కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయాలనే ఉద్దేశ్యం తో ఆ సినిమా కోసం భారీ రేంజ్ లో ఖర్చు పెట్టబొతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ద్వారా మరోసారి తనను తాను మెగాస్టార్ గా ప్రూవ్ చేసుకుంటాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…