Eating Cake : తరచుగా కేక్‌లు తింటున్నారా.. క్యాన్సర్‌ను కోరి తెచ్చుకున్నట్లే!

రాష్ట్రంలో తయారు చేసే కేక్‌లలో పరీక్షలు నిర్వహించగా మొత్తం 12 రకాల క్యాన్సర్లు ఉన్నాయని హెచ్చరించింది. పిల్లలకు అయితే అసలు కేక్ ఇవ్వద్దని చెబుతున్నారు. ఇందులోని మైదా, నాణ్యత లేని పదార్థాలతో తయారు చేయడం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారని అంటున్నారు.

Written By: Neelambaram, Updated On : October 3, 2024 9:55 pm

Eating Cake

Follow us on

Eating Cake :  స్వీట్‌గా ఉండే కేక్‌లు అంటే చాలామంది ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. ఏదైనా ఫంక్షన్, చిన్న సెలబ్రేషన్, బర్త్‌ డే ఇలా ఉంటే తప్పకుండా కేక్ కట్ చేస్తారు. బేకరీకి వెళ్లిన కూడా కేక్‌లు తినడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే అధికంగా స్వీట్, ఆయిల్ వంటివి చేసి తయారు చేస్తారు. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ ఆ మాటలు అన్ని పక్కన పెట్టి తినేస్తారు. వీటిని శుభ్రం పాటించకుండా.. నాణ్యత లేని పదార్థాలతో తయారు చేస్తారు. ఆ తర్వాత ఎక్కువ రోజులు వీటిని షాప్‌లో ఉంచుతారు. మనం తినే కేక్ టేస్టీ ఉంటుంది. కానీ అది ఎన్ని రోజుల కిందట తయారు చేసి పెడతారో తెలియదు. అయితే కేక్‌లను తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఆ రాష్ట్రంలో తయారు చేసే కేక్‌లలో పరీక్షలు నిర్వహించగా మొత్తం 12 రకాల క్యాన్సర్లు ఉన్నాయని హెచ్చరించింది. పిల్లలకు అయితే అసలు కేక్ ఇవ్వద్దని చెబుతున్నారు. ఇందులోని మైదా, నాణ్యత లేని పదార్థాలతో తయారు చేయడం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారని అంటున్నారు.

కేక్‌లో సాధారణంగా స్వీట్ ఎక్కువగా ఉంటుంది. చక్కెర కాకుండా ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌ను కూడా వాడుతుంటారు. వీటివల్ల కొందరు అధికంగా బరువు పెరుగుతారు. కేక్‌లు తినడానికి రుచిగా ఉంటాయి. కానీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కేక్‌లలో వాడే స్వీటెనర్లలో నియోటామ్ను అనేది ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఇతర దేశాల్లో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని వాడటం వల్ల శరీరంపై విషప్రభావాలు చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు గట్లో అని స్వీట్‌నర్ కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. వీటిని కొందరు అక్రమంగా తయారు చేసి అభివృద్ధి చేస్తుంటారు. వీటిని బేకరీ పదార్థాలకు ఎక్కువగా వాడుతుంటారు. ఇలాంటి వాటిని కేక్‌లలో వాడటం వల్ల క్యాన్సర్ ఇంకా ప్రమాదమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెరకు బదులు స్వీటెనర్లు సాచరిన్, సుక్రలోజ్ వంటివి వాడటం వల్ల ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు. ఇవి గుండె మీద ప్రభావం చూపిస్తాయి. గుండె ప్రమాదాలు వచ్చేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్వీటెనర్లు చక్కెర కంటే వెయ్యి రెట్లు అధికంగా తియ్యగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఇది మరణానికి కూడా దారితీస్తుందని అంటున్నారు. కాబట్టి కేక్, బేకరి ఐటెమ్స్‌కి కాస్త దూరంగా ఉండండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.