https://oktelugu.com/

Plastic packing : ప్లాస్టిక్ ప్యాకింగ్‌లోని పదార్థాలు తింటే ఎంత డేంజరో మీకు తెలుసా?

ప్లాస్టిక్ వస్తువుల్లో ఏవైనా పదార్థాలు ఉంటే అవి హానికరంగా మారతాయి. ముఖ్యంగా వేడి పదార్థాలను వేస్తే అవి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ప్లాస్టిక్‌లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. నాణ్యత ఉన్న ప్లాస్టిక్‌ను వాడటం వల్ల అంతగా అనారోగ్య సమస్యలు రావు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 3, 2024 9:37 pm
    Plastic packing

    Plastic packing

    Follow us on

    Plastic packing : ఈరోజుల్లో చాలామంది ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వాడుతున్నారు. వంటగదిలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అన్ని పదార్థాలతో పాటు చేసిన వంటలను కూడా ప్లాస్టిక్ వస్తువుల్లో పెడుతున్నారు. ఈమధ్య కాలంలో మనం సూపర్‌ మార్కెట్లో చూసిన పండ్లు, సలాడ్‌లు, మెలకెత్తిన గింజలు, గుడ్లు ఇలా ఒకటేంటి అన్ని రకాలను ప్లాస్టిక్ ప్యాకింగ్‌లు చేసి అమ్ముతున్నారు. వీటిని ఎక్కువ రోజులు టెంపరేచర్‌లో నిల్వ ఉంచడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజం చెప్పాలంటే మనం తినే ప్రతి ఒక్కదాన్ని కూడా ప్లాస్టిక్‌లోనే పెడుతున్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే లంచ్‌ బాక్స్‌ల నుంచి వండిన వంటలను కూడా అందులోనే వేస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసిన ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వచ్చి ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయిన ఈ రోజుల్లో ప్రతి చిన్న దానికి ప్లాస్టిక్ వాడుతున్నారు. లక్షలు పెట్టి ఆసుపత్రిలో డబ్బులు చెల్లిస్తారు. కానీ ఎక్కువ ఖర్చు పెట్టి గాజు వంటి వస్తువులను అసలు తీసుకోరు. ఆరోగ్యమే మహాభాగ్యమే. ఎంత ఆరోగ్యంగా ఉంటే జీవితంలో సంతోషంగా ఉంటారు. లేకపోతే జీవితంలో అనుభవించడానికి ఏం మిగలదు. కాబట్టి ఆరోగ్య విషయంలో నాణ్యత పాటించడం చాలా ఉత్తమం.

    ప్లాస్టిక్ వస్తువుల్లో ఏవైనా పదార్థాలు ఉంటే అవి హానికరంగా మారతాయి. ముఖ్యంగా వేడి పదార్థాలను వేస్తే అవి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ప్లాస్టిక్‌లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. నాణ్యత ఉన్న ప్లాస్టిక్‌ను వాడటం వల్ల అంతగా అనారోగ్య సమస్యలు రావు. కానీ నాణ్యత లేని వాటిని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే కొన్ని ప్లాస్టిక్‌లను ఒకసారి మాత్రమే వాడాలి. ఎక్కువ సార్లు వాడితే ఆరోగ్యానికి ప్రమాదం. ప్లాస్టిక్ పదార్థాల్లో వేడి పదార్థాలు, ఆమ్ల స్వభావం పదార్థాలు, నూనెలు నిల్వ చేయకూడదు. ప్లాస్టిక్‌లోని రసాయనాలు ఆహార పదార్థాల్లోకి చేరతాయి. వీటివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్​ డబ్బాలకు బ‌దులుగా గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్, సిలికాన్, బీస్‌వాక్స్‌తో తయారు చేసిన వస్తువులను వాడాలి. వీటిలో ఆహారాన్ని నిల్వ చేసిన ఏం కాదని నిపుణులు అంటున్నారు. అయితే తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వస్తువులు వాడాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులను వాడేటప్పుడు వాటిపై ఉన్న లేబుల్ను చూడాలి. ఫుడ్ గ్రేడ్, బీపీఏ ఫ్రీ అని ఉంటే అలాంటి ప్లాస్టిక వస్తువులను వాడవచ్చు. కానీ బీపీఏ ఫినాల్ ఉంటే వాడకూడదు. ఈ ప్లాస్టిక్ ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.