https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు లక్కీ డే.. అనుకోకుండా అదనపు ఆదాయం పొందే ఛాన్స్..

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి వేధింపులు ఉంటాయి. జీవిత భాగస్వామి విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 24, 2024 / 08:04 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ద్విపుష్కరయోగంతో పాటు బరియోగం ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి వేధింపులు ఉంటాయి. జీవిత భాగస్వామి విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు.

    వృషభ రాశి:
    సాయంత్రం శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందేందుకు మార్గం పడుతుంది. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

    మిథున రాశి:
    ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి.పిల్లల భవిష్యత్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. పిల్లల కెరీర్ పై దృష్టి పెట్టాలి.

    కర్కాటక రాశి:
    ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలు రచిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం వస్తుంది. కొన్ని తప్పుల వల్ల పశ్చాత్తాప పడుతారు.

    సింహారాశి:
    రాజకీయ రంగాల్లో ఉన్న వారికి అనుకూల వాతావరణం. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కన్య రాశి:
    కొత్త పెట్టుబడులపై దృష్టి పెడుతారు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

    తుల రాశి:
    స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. విద్యార్థులు భవిష్యత్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది.

    వృశ్చిక రాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. రాత్రి సమయంలో స్నేహితులతో సంతోషంగా ఉంటారు. సోదరుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఎవరితోనైన వాగ్వాదం జరిగితే దూరంగా ఉండండి.

    ధనస్సు రాశి:
    ఇంటి నిర్మాణానికి ఖర్చులు ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. శత్రువులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించండి..

    మకర రాశి:
    ఈ రాశి వారు అనేక రంగాల్లో పురోగతి సాధిస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

    కుంభరాశి:
    ఖర్చులు పెరుగుతాయి. తల్లిదండ్రుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడుతారు. సోదరుల సహాయంతో ఆదాయం పెరుగుతుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కష్టపడి పనిచేసిన వారికి ఫలితం లభిస్తుంది.

    మీనరాశి:
    వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని అనుకోని ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.