Health Tips: ప్రతి వ్యక్తికి జీవితంలో 4 ప్రధానమైన దశలు ఉంటాయి. బాల్యం, యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం.. వీటిలో యవ్వనం వరకు తల్లిదండ్రుల సమక్షంలోనే జీవితం ఉంటుంది. వీరికి సరైన ఆహారం అందడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే మధ్యవయసుకు వచ్చేసరికి సొంతంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ సమయంలో వీరు ఎన్నో విధులు, బాధ్యతలు ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల్లో శక్తి తగ్గడం మొదలవుతుంది. అందువల్ల ఇలాంటి సమయంలో పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
30 ఏళ్ల దాటిన తరువాత ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే అప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకున్నా పర్వాలేదు. కానీ ఈ సమయంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో బోన్స్ మెల్లగా అరగడం మొదలవుతాయి. అవి తొందరగా బలహీనంగా మారకముందే కాల్షియం పదార్థాలను తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న పాలు, చీజ్, బాదం వంటిని తీసుకుంటూ ఉండాలి.
30 ఏళ్ల తరువాత వారికి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో సరైన నిద్ర ఉండదు. పైగా పలుసార్లు నిద్రభంగం కలుగుతుంది. వీరు సరైన విధంగా నిద్రపోవాలంటే రాత్రి సమయంలో పసుపు పాలు తీసుకోవాలి. లేదా నిద్రించేముందు మెడిటేషన్ చేసే అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో యవ్వనం నుంచి మధ్య వయసుకు మారుతారు. అందువల్ల చర్మం ముడుతలు పడే అవకాశాలు ఎక్కువ. ఆ సమస్యలు రాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పదార్థాలు తీసుకోవాలి. సిట్రస్ పండల్లు, బ్రౌన్ రైస్, గ్రీన్ టీ వంటి పానీయం తీసుకోవడం వల్ల ప్రీరాడికల్స్ యవ్వనంగా కనిపిస్తాయి.
30 ప్లస్ వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. ఈ బీపీని నియంత్రించడానికి పోటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. టమాట, బంగాళ దుంప, అరటిపండ్లలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరుచూ తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది.
వీటితో పాటు అనేక శరీర అనారోగ్య సమస్యలు దరిచేరే ప్రమాదాలు ఉన్నాయి. మలబద్ధకం, ఫైల్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఈ వయసున్న వారికే. అందువల్ల ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటూ ఉండాలి. జీర్ణక్రియ సరిగా లేని వారు ఎక్కువగా పండ్లు, కూరగాయలు తింటూ ఉండాలి. ఇలా సరైన ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండగలుగుతారు.