Sperm Quality: స్పెర్మ్ నాణ్యత పెరిగేందుకు ఇవి తినండి..

ఉలవలు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. ఇది లైంగిక శక్తిని పెంచడానికి, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి సహాయం చేస్తాయి.

Written By: Swathi Chilukuri, Updated On : June 19, 2024 8:29 am

Sperm Quality

Follow us on

Sperm Quality: పురుషులకు ఉలవలు చాలా ఆరోగ్యకరం. వీటిని రెగ్యూలర్ గా తీసుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఉలవలలో జింక్, ఇతర పోషకాలు పురుష హార్మోన్ల ఉత్పత్తిని స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఇవి కేవలం మగవారికి మాత్రమే కాదు.. స్త్రీలకు కూడా చాలా మంచివి. వీటిలో ఉండే పోషకాలు మొగవారికి ప్రయోజనం చేకూరుస్తాయట. ఓ సారి వీటి గురించి తెలుసుకుందాం.

పురుషుల లైంగిక ఆరోగ్యం: ఉలవలు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. ఇది లైంగిక శక్తిని పెంచడానికి, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి సహాయం చేస్తాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది: ఉలవలు ఫైబర్, పొటాషియంల మూలాలు. ఉలవలు తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది… గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బరువు తగ్గిస్తాయి: ఉలవలు ప్రోటీన్, ఫైబర్ లకు మూలం కూడా. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడానికి తక్కువ తినడానికి సహాయం చేస్తాయి. దీని వల్ల బరువు పెరగరు.

రోగనిరోధక శక్తి: ఉలవల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఉలవల వల్ల శరీరం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి తప్పించుకోవచ్చు.
జీర్ణక్రియ: ఉలవల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

అయితే ఈ ఉలవలను రాత్రంతా నానబెట్టి ఉడికించి పప్పు, సాంబార్, ఉప్మా వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. ఉలవ పిండిని చేసి దోసెలు, ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. ఉలవలను మెత్తగా పొడి చేసి లడ్డులు, బిస్కెట్లు కూడా చేసుకోవచ్చు. అయితే, కొంతమందిలో ఉలవలు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి, మొదట తక్కువ మోతాదులో తినాలి. ఆ తర్వాత ఎలాంటి సమస్యలు లేకపోతే వీటి పరిమాణం కాస్త పెంచుకోవచ్చు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను కూడా సంప్రదించండి.