https://oktelugu.com/

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ అంత కలిసి మరో సినిమా చేయబోతున్నారా..?

మనం సినిమా రిలీజ్ అయి పది సంవత్సరాలు గడిచినప్పటికి ఈ మూవీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇక ఈ మూవీ అక్కినేని వారి మెమరబుల్ మూవీ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 08:53 AM IST

    Akkineni Family

    Follow us on

    Akkineni Family: తెలుగు సినిమా ఇండస్ట్రీ అక్కినేని ఫ్యామిలీకి మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే వీళ్ల ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిన మనం సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే మనం సినిమా రిలీజ్ అయి పది సంవత్సరాలు గడిచినప్పటికి ఈ మూవీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇక ఈ మూవీ అక్కినేని వారి మెమరబుల్ మూవీ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించబోతున్నారు అనే వార్తలైతే సినిమా ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు అనే దానిమీద సరైన క్లారిటీ లేదు కానీ ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకు రైటర్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయనే ఒక అదిరిపోయే కాన్సెప్ట్ ని నాగార్జునకి వినిపించారట. దాంతో నాగార్జున ఎగ్జైట్ అయిపోయి ఈ సినిమాని మా ఫ్యామిలీ వాళ్లతో కలిసి చేద్దాం అని ప్రసన్న కుమార్ కి చెప్పారట.

    ఇక దాంతో నాగార్జున ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి తన వందో సినిమాగా నాగ్ ఈ సినిమానే చేస్తాడా లేదంటే మరొక సినిమాకి వెళ్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీకి మనం సినిమాకి దర్శకత్వం వహించిన విక్రమ్ కే కుమార్ ను డైరెక్టర్ గా తీసుకుంటారా లేదంటే ఇంకా వేరే డైరెక్టర్ తో సినిమా చేయిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ప్రజెంట్ అయితే అక్కినేని ఫ్యామిలీలో ఉన్న హీరోలు అందరూ కూడా ప్లాపుల్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అర్జెంటుగా ఒక హిట్ అయితే కావాలి. మరి ఈ సినిమాతో ఫ్యామిలీ అంతా కలిసి ఒక భారీ హిట్ ను సాధిస్తారా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…