Tesla Hydrogen Car: టెస్లా హైడ్రోజన్‌ కార్లు.. త్వరలో మార్కెట్‌లోకి..

అమెరికన్‌ కార్ల తయారీ సంస్థ టెస్లాకు.. చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ బివైడీ(బిల్డ్‌ యువర్‌ డ్రీమ్‌) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

Written By: Raj Shekar, Updated On : June 19, 2024 8:20 am

Tesla Hydrogen Car

Follow us on

Tesla Hydrogen Car: ప్రపంచ కుబేరుడు.. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ప్రపంచ గుర్తింపు పొందిన టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ఇప్పటి వరకు టెస్లాను ఎవరూ బీట్‌ చేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ ఈవీ కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ డిమాండ్‌ కొనసాగుతుండగానే… మస్క్‌ మరో నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో హైడ్రోజన్‌ కార్లను తీసుకువాలని భావిస్తున్నారు.

ఈవీ కార్లకు చైనా పోటీ..
అమెరికన్‌ కార్ల తయారీ సంస్థ టెస్లాకు.. చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ బివైడీ(బిల్డ్‌ యువర్‌ డ్రీమ్‌) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ తరుణంలో మస్క్‌ భవిష్యత్‌లో ఈవీ కార్లకు మరింత పోటీ ఎదురవుతుందని భావించారు. ఈ నేపథ్యంలోనే హైడ్రోజన్‌ కార్లను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

2026 నాటికి మార్కెట్‌లోకి..
టెస్లా హైడ్రోజన్‌ కార్లను 2026 నాటికి లాంఛ్ చేయనున్నట్లు సీఈవో మస్క్‌ తెలిపారు. ఈమేరకు త్వరలోనే హైడ్రోజన్‌ కార్ల ప్రాజెక్టుపై దృష్టిపెట్టనుంది. హైడ్రోజన్‌తో నడిచే మొదటి కారు మోడల్‌ హెర్‌ను 2026లో ఆవిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

అమెరికాకే పరిమితం?
టెస్లా తయారు చేసే హైడ్రోజన్‌ కార్లను కేవలం అమెరికాకే పరిమితం చేస్తారని తెలుస్తోంది. అమెరికాలో సక్సెస్‌ అయిన తర్వాతనే ఇతర దేశాల మార్కెట్‌లో లాంఛ్ చేస్తారని తెలుస్తోంది.