Eat mulberry fruit: ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ మనకి కొన్ని రకాల పండ్ల గురించి మాత్రమే తెలుసు. వాటినే డైలీ ఎక్కువగా తింటారు. అయితే మనకి తెలియని చాలా రకాల పండ్లు మార్కెట్లో ఉన్నాయి. కొన్ని రకాలు పండ్లను డైలీ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల పండ్లను డైలీ లైఫ్‌లో అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా కూడా ఉంటారు. పండ్లు డైలీ తినడం వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే మనకి మార్కెట్లో కొన్ని పండ్లు అన్ని రోజులు దొరకవు. సీజన్ల బట్టి మాత్రమే దొరుకుతాయి. కనీసం సీజన్లలో అయిన వీటిని ఫుల్‌గా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. అలాంటి పండ్లలో మల్బరీ ఒకటి. మరి ఈ పండును డైలీ తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మల్బరీ పండు రోజూ తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఐరన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. మల్బరీ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయం చేస్తాయి. మల్బరీలో ఉండే జియాక్సంతిన్ కంటి చూపు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పండులో నీరు అధిక శాతం ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. డైలీ వీటిని ఏదో విధంగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
మల్బరీ చెట్టు ఆకులను ఆయుర్వేదానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పోషకాలు వల్ల బాడీకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులోని పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తాయి. ఎముకల సమస్యలు, బోలు ఎముకల వ్యాధుల వంటి సమస్యలను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. విరిగిన ఎముకలను కూడా అతికించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మల్బరీ పండ్లలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధించడంలో సహాయపడతాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. మల్బరీ పండ్లు మాత్రమే కాకుండా ఆకులతో కూడా మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఈ పండ్లు మార్కెట్లో చాలా అరుదుగా దొరుకుతాయి. సీజన్‌లో దొరికినప్పుడు వీటిని తినేయండి. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.