https://oktelugu.com/

Bigg Boss Telugu 8: మణికంఠ ని మళ్ళీ హీరోని చేస్తున్న యష్మీ.. ఇదేమి శాడిజం.. ఇంత కుళ్ళు ఎందుకు?

పాపం మణికంఠ బాధతో యష్మీ వైపుకు చూస్తాడు. ఈ ఒకేఒక్క చిన్న సంఘటనతో యష్మీ తన గ్రాఫ్ ని తానే చేతులారా సర్వ నాశనం చేసుకుంది. ఇంత నెగటివ్ క్యారక్టర్ ఏంటి అని ఆడియన్స్ ఆశ్చర్యపోయారు, సోనియా ఈమెకంటే వెయ్యి రెట్లు బెటర్ కదా అనే అభిప్రాయాన్ని జనాలు సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు. యష్మీ ఇప్పటి వరకు తన నెగటివ్ ఆలోచనలతోనే గేమ్ ఆడుకుంటూ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 08:03 AM IST

    Bigg Boss Telugu 8(89)

    Follow us on

    Bigg Boss Telugu 8: మూర్ఖత్వం కారణంగా మనుషులు తమని తాము సర్వనాశనం చేసుకుంటారు అని పెద్దలు చెప్తుంటారు. అందుకు ఎన్నో ఉదాహరణలు కూడా మనం చూసే ఉంటాము. ఇప్పుడు లేటెస్ట్ ఉదాహరణగా బిగ్ బాస్ సీజన్ 8 లో యష్మీ ని తీసుకోవచ్చు. హౌస్ లో ఉన్న ఓజీ క్లాన్ సభ్యులు (పాత కంటెస్టెంట్స్), రాయల్ క్లాన్ సభ్యులు(వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్), ఇలా ఈ రెండు క్లాన్స్ కి సంబంధించిన సభ్యులు మణికంఠ ని టార్గెట్ చేయకూడదు, అతనికి జనాల్లో రోజురోజుకి సానుభూతి పెరిగిపోతుంది అని అతన్ని ఎవ్వరూ నామినేట్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ టేస్టీ తేజా మాత్రం మణికంఠ ని నామినేట్ చేస్తాడు. ఇక్కడ యష్మీ తన మూర్ఖత్వ బుద్ధి ని మళ్ళీ చూపించుకుంది. ఒక మనిషి పై మరీ ఇంత ద్వేషమా అని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది. తేజ నామినేషన్ బోర్డుని తీసుకెళ్లి మణికంఠ మెడలో వేయగానే యష్మీ ఆనందం తో చేతులు కొట్టుకుంటుంది.

    పాపం మణికంఠ బాధతో యష్మీ వైపుకు చూస్తాడు. ఈ ఒకేఒక్క చిన్న సంఘటనతో యష్మీ తన గ్రాఫ్ ని తానే చేతులారా సర్వ నాశనం చేసుకుంది. ఇంత నెగటివ్ క్యారక్టర్ ఏంటి అని ఆడియన్స్ ఆశ్చర్యపోయారు, సోనియా ఈమెకంటే వెయ్యి రెట్లు బెటర్ కదా అనే అభిప్రాయాన్ని జనాలు సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు. యష్మీ ఇప్పటి వరకు తన నెగటివ్ ఆలోచనలతోనే గేమ్ ఆడుకుంటూ వచ్చింది. ఈ మనిషిలో ఇన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టే సీరియల్స్ లో ఆమెకు డైరెక్టర్స్ అన్నీ నెగటివ్ రోల్స్ ఇస్తుంటారేమో అని అనిపించింది. కేవలం ఆమె అందాన్ని చూసి ఓట్లు వేసే కుర్రోళ్లకు కూడా ఆమె నిన్నటి ఎపిసోడ్ తో చిరాకు రప్పించేసింది. గౌతమ్ ఆమెకు చాలా స్పష్టంగా బయట ఎలా వెళ్తుంది అనేది అర్థం అయ్యేలా చెప్పాడు. అయినప్పటికీ కూడా యష్మీ తగ్గలేదు, తేజ నామినేషన్ చేయగానే తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఒక సైకో లాగా చేతులు కొట్టుకోవడం ఏమిటి అనేది ఆమెని అభిమానించే వాళ్లకు కూడా అర్థం కావడం లేదు. తేజ నామినేషన్ ని పూర్తి చేయగానే యష్మీ అతన్ని పిలిచి ‘చాలా థాంక్యూ’ అని అంటుంది. మూడవ నామినేషన్ ఛాన్స్ ఇస్తే నేను నీకే ఓటు వేస్తాను అని అంటాడు టేస్టీ తేజ.

    అప్పుడు యష్మీ ‘ఏమి పర్వాలేదు..రెండవ నామినేషన్(మణికంఠ) చాలు, నాకు చాలా ఆనందంగా ఉంది’ అని అంటుంది. అప్పుడు గౌతమ్ ‘ఇవే..తగ్గించుకోమని చెప్పింది’ అని అంటాడు. అప్పుడు యష్మీ ‘ఏయ్ గౌతమ్..నేను తగ్గించుకోను’ అని పొగరుగా సమాధానం చెప్తుంది యష్మీ. ఆ తర్వాత టేస్టీ తేజా, ప్రేరణ, యష్మీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేరణ మేము బయట ఏమి జరుగుతుందో గమనించి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాము, నువ్వు మణికంఠ ని నామినేట్ చేయగానే ఈమె చేతులు కొట్టుకుంటూ సంబరాలు చేసుకుంది, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, కానీ వినలేదు అని అంటుంది. అప్పుడు యష్మీ ‘అవి నా ఎమోషన్స్..కంట్రోల్ చేసుకోలేను’ అని అంటుంది. యష్మీ ఇంకో రెండు వారాలు హౌస్ లో కొనసాగితే బిగ్ బాస్ మణికంఠ చేతిలో కప్ పెట్టి పంపడం ఖాయం గా అనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.