ఉదయం తొందరగా లేచేవారిలో దారుణమైన వ్యాధి.. ఏంటంటే?

మనలో చాలామందికి తెల్లవారుజామునే లేచే అలవాటు ఉంటుంది. అయితే తెల్లవారుజామున లేచేవాళ్లకు మతిమరపు ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. త్వరగా నిద్ర లేచేవారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడతారని శాస్త్రవేత్తలు తేల్చారు. ఉదయం నిద్రతో అల్జీమర్స్ వ్యాధికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు అర మిలియన్ మందిపై పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. Also Read : స్విట్జర్లాండ్‌లో చాక్లెట్ మంచు.. అసలు ఏమైందంటే? శాస్త్రవేత్తలు 5 […]

Written By: Kusuma Aggunna, Updated On : August 21, 2020 8:57 am
Follow us on

మనలో చాలామందికి తెల్లవారుజామునే లేచే అలవాటు ఉంటుంది. అయితే తెల్లవారుజామున లేచేవాళ్లకు మతిమరపు ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. త్వరగా నిద్ర లేచేవారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడతారని శాస్త్రవేత్తలు తేల్చారు. ఉదయం నిద్రతో అల్జీమర్స్ వ్యాధికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు అర మిలియన్ మందిపై పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Also Read : స్విట్జర్లాండ్‌లో చాక్లెట్ మంచు.. అసలు ఏమైందంటే?

శాస్త్రవేత్తలు 5 లక్షల మందికి సంబంధించిన జన్యు సమాచారం, నిద్ర విషయాలను లోతుగా విశ్లేషించారు. ఉదయం సమయంలో తొందరగా నిద్ర లేచేవారిని మార్నింగ్ పీపుల్ అని పిలుస్తారు. వీరిలో సాధారణ వ్యక్తులతో పోలిస్తే అల్జీమర్స్ ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదయం త్వరగా నిద్ర లేచే వారు తక్కువ సమయం నిద్ర పోతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిద్ర విధానాలు వ్యాధికి కారణం కాకపోయినా వ్యాధి ప్రారంభానికి సంకేతం అని శాస్త్రవేత్తలు తెలిపారు. అధ్యయన పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ అబ్బాస్ డెహగాన్ అల్జీమర్స్ కు గురయ్యేవారు ఉదయం త్వరగా నిద్ర లేస్తున్నట్టు కనుగొన్నామని చెప్పారు. అల్జీమర్స్ బారిన పడే ముందు చాలామంది ప్రజలు నిద్రకు సంబంధించిన రుగ్మతలను ఎదుర్కొంటున్నారని అన్నారు. యూరోపియన్లపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయని… వివిధ జాతుల ప్రజాలకు ఈ ఫలితాలు వర్తించవని పేర్కొన్నారు. నిద్ర విధానాలు, అల్జీమర్స్ వ్యాధి మధ్య సంబంధాల గురించి తాము పరిశోధనలు చేశామని శాస్త్రవేత్తలు చెప్పారు. అడుకానుమాబ్ మందు ద్వారా వ్యాధి పురోగతిని ఆపవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read : ఒత్తిడితో బాధపడేవాళ్లు యోగా చేస్తే ఏం అవుతుందో తెలుసా?