https://oktelugu.com/

మోడీ బాటలో పవన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వదేశీ ఉత్పత్తుల ఉపయోగించడంలో మోడీ బాట లో నడుస్తున్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆత్మ నిర్భర్ భారత్’ ద్వారా మన దేశీయ ఉత్పత్తులను వాడటం, ప్రోత్సహించడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని  ఉటంకిస్తూ… రాష్ట్ర ప్రజలకు పవన్ మన దేశీ ఉత్పత్తులను వాడాలని పిలుపునిచ్చారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దేశీయ ఉత్పత్తులను వాడటం, ప్రోత్సహించడమేనని అన్నారు. దీని ద్వారా మన ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 21, 2020 / 11:19 AM IST
    Follow us on

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వదేశీ ఉత్పత్తుల ఉపయోగించడంలో మోడీ బాట లో నడుస్తున్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆత్మ నిర్భర్ భారత్’ ద్వారా మన దేశీయ ఉత్పత్తులను వాడటం, ప్రోత్సహించడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని  ఉటంకిస్తూ… రాష్ట్ర ప్రజలకు పవన్ మన దేశీ ఉత్పత్తులను వాడాలని పిలుపునిచ్చారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దేశీయ ఉత్పత్తులను వాడటం, ప్రోత్సహించడమేనని అన్నారు. దీని ద్వారా మన ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, తద్వారా జీడీపీ వృద్ధి చెందుతుందని వివరించారు.

    Also Read : న్యాయవ్యవస్థకు శస్త్రచికిత్స జరగాలి

    గతంలో పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తలెత్తిన అపోహలను పోగొట్టడంలో బీజేపీ సర్కార్ కి పవన్ సహాయం చేసారు. అనేకమైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ముస్లింలకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడంలో పవన్ కళ్యాణ్ మోడీ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఆత్మ నిర్భర్ భారత్ పై ప్రజలలో అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేసేందుకు జనసేన, భారతీయ జనతా పార్టీలు సంయుక్తంగా ఈ వినాయక చవితి నుంచి కార్యక్రమాలు చేపడతాయని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కారణం ఏమిటంటే మన దేశంలో ఏ పనైనా ప్రారంభించినప్పుడు విజయం కలగాలని విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేసి మొదలు పెడతాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వినాయక చవితి పర్వదినాన్ని ఎంచుకున్నామని పవన్ తెలిపారు.

    మన పండగల్లో, సంప్రదాయ కార్యక్రమాల్లో మనకి తెలియకుండానే విదేశీ వస్తువులు చేరిపోతున్నాయి. విదేశాల్లో తయారైన దేవతామూర్తుల విగ్రహాలు, పూజా ద్రవ్యాలు, పూజా సామగ్రిలు ఉపయోగిస్తున్నాం. తద్వారా ఆ దేశ అభివృద్ధికి తమకు తెలియకుండానే తోడ్పడుతున్నాం. ఈ వినాయక చవితికి మనం ఏదీ కొన్నా అది స్వదేశీ ఉత్పత్తా..? లేక విదేశీ ఉత్పత్తా అని చూడాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

    Also Read : జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు