Dulip trophy 2024 : ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున యువ ఆల్ రౌండర్ గా అన్షుల్ కాంబోజ్ కు పేరుంది. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో అతడు నిప్పులు చెరిగాడు. ఇండియా – సీ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇండియా – బీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్లు సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ లో 38 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక బౌలింగ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలిసారి ఐదు వికెట్ల రికార్డును తన పేరు మీద లోఖించుకున్నాడు. వాస్తవానికి ఈ మైదానం బౌలింగ్ కు ఏ మాత్రం అనుకూలం కాదు. అయినప్పటికీ 5 వికెట్లు పడగొట్టాడు. ఇండియా – బీ జట్టుకు చెందిన ప్రధాన ఆటగాళ్లు నారాయణ జగదీషన్(70), ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ (16), రింకు సింగ్(6), తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (2) అన్షుల్ చేతిలో బలయ్యారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డిని క్లీన్ బౌల్డ్ చేసి అన్షుల్ ఐదు వికెట్ల రికార్డును సాధించాడు. వాస్తవానికి ఫ్లాట్ మైదానంపై ఐదు వికెట్లు తీసిన అన్షుల్ పై నెటిజన్లు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
బౌలర్ల సహకారం లేకపోయినప్పటికీ..
ఇండియా – సీ జట్టు ఇతర బౌలర్ల నుంచి అన్షుల్ కు సహకారం లభించలేదు. అయినప్పటికీ అతడు ఒక్కడే 5 వికెట్లు పడగొట్టాడు. ఇండియా – బీ జట్టు బాటర్లకు చుక్కలు చూపించాడు. అన్షుల్ ధాటికి 194 పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయింది.. శనివారం ఆట ముగిసే చేసే సమయానికి ఇండియా – బీ జట్టు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 143, రాహుల్ చాహర్ 18 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మయాంక్ మార్కండే, విజయ్ కుమార్ వైశాఖ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఐపీఎల్ సీజన్లో..
అన్షుల్ ఐపీఎల్ 2024 సీజన్లో మూడు మ్యాచ్ లు ఆడాడు. రెండు పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శన నేపథ్యంలో అన్షుల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ” అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్లాట్ మైదానంపై బుల్లెట్ ఇలాంటి బంతులు వేస్తున్నాడు. ఇతర బౌలర్ల నుంచి సహకారం లేకపోయినప్పటికీ 5 వికెట్లు పడగొట్టాడు. ఇటువంటి బౌలర్ కు జాతీయ జట్టులో సులభంగా ప్రవేశం లభిస్తుంది. అతడు ఇలాగే బౌలింగ్ చేస్తే జాతీయ జట్టుకు బలం లభిస్తుంది. బౌలింగ్ విభాగం మరింత పట్టిష్టమవుతుంది. ఇతడు చూడబోతే బుమ్రా వారసుడి లాగా కనిపిస్తున్నాడని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.