Drug dealers : మత్తు ఏ రూపంలో ఉన్నా అతి మంచిది కాదు. ఎందుకంటే మత్తు అనేది ఆరోగ్యాన్ని చిత్తు చేస్తుంది. అమ్మేవాడికి కాసులు కురిపిస్తుంది. వెనకటికి కొలంబియాలో ఒక పోలీస్ అధికారి మత్తు పదార్థాల విక్రయించే వ్యక్తులను పట్టుకొని తొక్కినారి తీసేవాడు. ఆయనను అప్పట్లో ఒక హీరోలాగా చూసేవారు. అయితే అతడి కుమారుడు దారి తప్పాడు. మత్తు పదార్థాల వ్యాపారిగా మారిపోయాడు. దీంతో కొడుకుని ఆ తండ్రి పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడిని అరెస్ట్ చేస్తున్నప్పుడు తలవంచుకొని కన్నీరు పెట్టాల్సిన దుస్థితి ఎదురయింది.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ఎస్పీలకు ఎదురైంది.
Also Read: మద్యం తాగేవారికి అలర్ట్.. ఈ బ్రాండ్ టెస్ట్ చేశారా?
తెలంగాణ రాష్ట్రంలో మత్తుపదార్థాలను లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి లోగడ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ఆయన బలంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈగల్ అనే వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశారు. ఆ ఈగల్ వ్యవస్థ హైదరాబాద్ లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. మత్తు పదార్థాలు అమ్మే వారి మీద ఉక్కు పాదం మోపుతోంది. పకడ్బందీ ఆధారాలతో జైలుకు పంపిస్తోంది. సరిగ్గా ఆదివారం ఒక ఆపరేషన్ చేసి ఏకంగా 14 మంది మత్తు పదార్థాల బానిసలను ఈగల్ టీం పట్టుకుంది. వారందరిని డి అడిక్షన్ సెంటర్ కి పంపించింది. అంతేకాదు దాని కంటే ముందు ఒక పెద్ద ఆపరేషన్ చేపట్టి మత్తు పదార్థాలు ఒక డీలర్ ను పట్టుకుంది. అతడి ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా మత్తుపదార్థాలను కొనుగోలు చేసే వారిని ఈగల్ టీం పట్టుకుంది. మత్తు పదార్థాల ఆనవాళ్లు లేకుండా చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది.
మత్తు పదార్థాలు విక్రయించే వారిని పట్టుకోవడానికి ఈగల్ టీం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే మత్తు పదార్థాల వ్యాపారంలో పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల కుమారులు ఉండడం సంచలనం కలిగిస్తోంది. ఈగల్ టీం వారిద్దరిని అరెస్ట్ చేసింది. ఇటీవల హైదరాబాద్ లోని కొంపల్లి ప్రాంతంలో మల్నాడు రెస్టారెంట్లో మత్తు పదార్థాల దావత్ జరిగింది. అయితే ఇందులో ఆర్మ్ డ్ రిజర్వ్ విభాగానికి చెందిన డిసిపి అధికారి కుమారుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇప్పటికే ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు రాహుల్ తేజ అని కూడా ఈగల్ టీం అరెస్ట్ చేసింది. రాహుల్ మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి ఈ మత్తు పదార్థాల వ్యాపారం సాగిస్తున్నట్టు ఈగల్ బృందం గుర్తించింది. గడిచిన నెలలో నిజామాబాద్ జిల్లాలో మత్తు పదార్థాల వ్యవహారం ఒకటి తెరపైకి వచ్చింది. అయితే అందులో కూడా రాహుల్ తేజ సూత్రధారి అని తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడి పోలీసులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని సమాచారం. ఎఫ్ఐఆర్ లో మాత్రం పేరు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేయలేదని ఈగల్ టీం గుర్తించింది..
Also Read: మొదటి రోల్స్ రాయల్స్ కారు కొన్న ఆ తెలుగు నటుడు…అంత్యక్రియలను చందలేసుకోని చేశారు..?
సమాజానికి సుద్దులు చెబుతూ.. నేరగాళ్ల మీద ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు తమ పుత్ర రత్నాల విషయంలో మాత్రం ఉదారత చూపుతున్నారు. పైగా ఉన్నతాధికారుల కుమారులు మత్తు పదార్థాల దందాలో ఉండడం తెలంగాణ పోలీస్ శాఖకే తల పంపు కలిగిస్తోంది. గతంలో మత్తు పదార్థాల దందాలో దొరికినప్పటికీ పోలీస్ ఉన్నతాధికారి కుమారుడి పట్ల ఖాకీలు ఉదారత చూపడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..” అదే దందా ఇతరులు చేస్తే పోలీసులు ఊరుకుంటారా? ఇప్పటికే అరెస్ట్ చేసి లోపల వేసేవారు. తన తండ్రి ఉన్నదాధికారి కావడంతో రాహుల్ తేజ రెచ్చిపోయాడు. ఈ మత్తు పదార్థాల వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. అప్పుడే గనక పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ఉంటే ఇక్కడదాకా వచ్చేది కాదు. తన తండ్రి అధికార దర్పాన్ని చూసి అతడు రెచ్చిపోయాడు. పాపం పండి దొరికిపోయాడు. ఇటువంటి వ్యక్తుల వల్ల సమాజం సర్వనాశనం అవుతుందని” ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్తు పదార్థాలు విక్రయించే వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.