TDP Second Governor Nominee: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ బలోపేతం దిశగా బిజెపి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. మిత్రపక్షాలను సైతం ప్రోత్సహించి ఎన్డీఏ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. 2029 ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతోంది. బిజెపితో రాజకీయ స్నేహం ఎంతో ప్రయోజనమని సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ గా అవకాశము ఇచ్చింది. తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ పోస్ట్ తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన టిడిపి నేతలకు కేంద్రంలో కీలక నియామకాల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ విస్తరణకు సంకేతాలు పంపాలని భావిస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.
త్వరలో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు..
దేశవ్యాప్తంగా త్వరలో 3 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్( Bihar),తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బిజెపి పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మిత్రులతో మరింత మైత్రి కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గా అవకాశం కల్పించారు. వాస్తవానికి 2014- 18 మధ్య టిడిపికి గవర్నర్ హామీ ఉండేది. కానీ అప్పట్లో రాజకీయ పరిస్థితులు కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు టిడిపి ఎన్డీఏలో కీలక భాగస్వామి. అందుకే గవర్నర్ నియామకంతో పాటు కేంద్ర పదవుల విషయంలో ఆ పార్టీకి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. మరోవైపు టిడిపికి మరో గవర్నర్ పదవి హామీ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Hindi Language Debate: భాషా వివాదం ఎవరి ప్రయోజనం కోసం? ప్రజలు అప్రమత్తం కావాలిసిన వేళ!
తెరపైకి రకరకాల పేర్లు..
అయితే ఇప్పుడు రెండో గవర్నర్ పదవి తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) ఎవరికీ దక్కుతుంది అన్నది చర్చ జరుగుతోంది. అశోక్ గజపతిరాజు ఎంపిక వేళ అనేక సమీకరణలు తెరపైకి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావడం, వివాదరహితుడు కావడంతో ఏకాభిప్రాయంతో ఆయన పేరును సిఫారసు చేశారు చంద్రబాబు. అయితే ఈసారి గవర్నర్ పదవి టిడిపికి ఇస్తే బీసీ నేతకు ఇస్తారని తెలుస్తోంది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్నా.. ఆయనకు రాజ్యసభకు పంపించి.. కేంద్ర రాజకీయాల్లో ఆయన సేవలను వినియోగించుకుంటారని తెలుస్తోంది. యనమల రామకృష్ణుడు కు రాజ్యసభ పదవి పైనే ఎక్కువగా మొగ్గు ఉంది. పైగా రాజకీయ వ్యూహ సేవలను ఆయన నుంచి ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.
రాయలసీమ బీసీ నేత..
టిడిపికి రెండో గవర్నర్ పోస్ట్ వస్తే మాత్రం రాయలసీమకు చెందిన బీసీ నేతకు అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కేఈ కృష్ణమూర్తి( Ke Krishna Murthy ) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన చంద్రబాబు సమకాలీకుడు. ఆయనతో పాటు కాంగ్రెస్లో ఉండి టిడిపిలో చేరారు. ఆది నుంచి ఒకే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడుకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అదే కేఈ కృష్ణమూర్తికి గవర్నర్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?