First Rolls Royce in Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్ప చరిత్ర అయితే ఉంది. ఎంతో మంది మహానుభావులు తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్ కి తీసుకెళ్లడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేశారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒక నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచడమే కాకుండా మొదటి పద్మశ్రీ అవార్డుని అందుకున్నాడు. అలాగే ఆయన చేసిన సినిమాలోని నటనకి భారతదేశపు రాష్ట్రపతి సైతం అతన్ని పిలిపించుకొని అతని కాళ్లకు నమస్కరించాడు. అంటే ఆయన నటన ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…అలాగే ఆ నటుడు మొదట రోల్స్ రాయల్స్ కారుని కూడా కొన్న నటుడిగా పేరు ప్రఖ్యాతాలను అందుకున్నాడు… ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే చిత్తూరు నాగయ్య… ఒకప్పుడు స్టార్ హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో చిత్తూరు నాగయ్య లాంటి నటుడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా ఆయన లవకుశ సినిమాలో ‘వాల్మీకి’ (Valmki) అనే క్యారెక్టర్ ద్వారా ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులకైతే పరిచయం అవుతాడు. ఎందుకంటే ఆయన అంతకుముందు చేసిన యోగి వేమన లాంటి సినిమాలు మనలో చాలామంది చూసి ఉండరు. కాబట్టి లవకుశ సినిమాతో ఆ మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. మరి అలాంటి చిత్తూరు నాగయ్య లైఫ్ లో ఎన్నో గొప్ప గొప్ప అధ్యాయాలు అలాంటి వ్యక్తి చివరి రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితిల్లో మరణించాడని చెబితే ఒక్కొక్కరి హృదయం ద్రవించిపోతోంది.
Also Read: పోకిరి సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారు…
చివరి రోజుల్లో ఆయనకు తినడానికి తిండి కూడా లేక చాలావరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారట. మరి అంత గొప్ప వ్యక్తి అంత భారీ రేంజ్ లో డబ్బులను సంపాదించుకున్న వ్యక్తి ఎందుకలా అయిపోయాడు. అంటే ఆయన ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆదుకునేవాడు అందువల్లే ఆయనకి చివరి స్టేజ్ లో అలాంటి ఒక దుర్భరమైన పరిస్థితి అయితే ఎదురైందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు.
చివరికి ఆయన చనిపోయిన తర్వాత దహన సంస్కారాలకి కూడా డబ్బులు లేవట. తలా ఒకరు చందాలు వేసుకొని అతని దహన సంస్కారాలు నిర్వహించారు అంటూ చాలామంది అతని గురించి చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ లో డబ్బులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు సహాయం చేయాలని చూస్తుంటారు. సహాయం చేయడంలో తప్పులేదు కానీ నీ తాహతకు మించి సహాయం చేయడం చాలా తప్పు…
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా… విజయ్ నామ సంవత్సరం స్టార్ట్ అవ్వనుందా..?
డబ్బులు ఉన్నప్పుడు విలువ తెలియదు. వాటిని జాగ్రత్తగా దాచుకుంటూ ముందుకు సాగాలి. ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి డబ్బుల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉన్నప్పుడే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సక్రమంగా లీడ్ చేయగలుగుతారు… ఇక సినిమా ఇండస్ట్రీలో చాలామంది ధనధర్మాలు చేసి చివరికి వాళ్లకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితులను ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు…