Warm Water: ఉదయం లేవగానే మీరు చేసే పని ఏంటి అని ఒకసారి ఆలోచించండి.. ముందుగా ఫోన్ పడుతారు. ఉదయాన్నే ఫోన్ ఏంటి అనుకుంటే ఇంట్లో పనులు చేసుకుంటారు. కదా.. కాస్త ఈ టైమ్ టేబుల్ లో మార్పు రావాలి. ఎందుకో తర్వాత తెలుసుకుందాం.. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మీ ఆరోగ్యం కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేలు ఖర్చు చేసి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే కంటే.. ముందు జాగ్రత్త పడటం చాలా ఉత్తమం. మీరు ఉదయాన్నే ఒక చిన్న పని చేయండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది..
వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవినశైలి చాలా అవసరం. సరైన వ్యాయామం, సరైన సమయంలో తినడం వల్ల మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వీటితో పాటు మరికొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా అలవాటు చేసుకోవాల్సిందే. ఉదయం లేవగానే గోరు వెచ్చని నీరు తాగడం చాలా ముఖ్యం. కాస్త నీటిని స్టవ్ మీద పెట్టేస్తే రెండు నిమిషాల్లో వేడి అవుతాయి. అంతే అదే గోరువెచ్చని నీటిని తాగాలి. జస్ట్ సింపుల్ కానీ దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.
చలికాలం, వర్షాకాలం, వేసవి కాలం అంటూ తేడా లేకుండా ఉదయాన్నే ఈ గోరు వెచ్చని వాటర్ తాగాలి. అది కూడా ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోండి. అయితే శరీరంలో పేరుకుపోయిన మురికిని ఎలాగైన వదిలించేసుకోవాల్సిందే. ఒకవేళ ఈ మురికి గనుక బయటకు రాకపోతే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యానికి గురవుతారు. అయితే ఉదయమే గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మురికి, విషపదార్థాలు వెళ్లిపోతాయి. అంటే ఆరోగ్యకరమైన శరీరం మన సొంతం.
గోరు వెచ్చని నీటి ద్వారా చర్మంలో దాగి ఉన్న టాక్సిన్లు, మట్టి కణాలు తొలిగిపోయేందుకు అవకాశం కూడా ఎక్కువే. అంతేకాదు మీ చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. త్వరగా పొడిబారదు. అంటే ముఖ కాంతి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఇక రక్తప్రసరణ మెరుగ్గా జరుగడమే కాదు చర్మ ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ముడతలు కూడా తగ్గుతాయి. అయితే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ తల మీది చర్మానికి రక్తప్రసరణ బాగా అవుతుంది. దీంతో జుట్టు పెరుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది. చూశారా కేవలం గోరు వెచ్చని నీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..ఎందుకు ఆలస్యం మరి ఖర్చు లేని ఈ టిప్ ను ప్రతి రోజు ఉదయం పాటించండి.. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.