https://oktelugu.com/

Sleeping Tips: మీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలా పడుకోవాలి? జాగ్రత్తలివీ..

కొందరు నిద్రిస్తున్నప్పుడు విపరీతమైన గురక పెడుతారు.ఉబకాయంతో బాధపడేవారిలో ఇది అధికంగా ఉంటుంది. అయితే వారు వెల్లకిలా పడుకున్నప్పుడు గురక తీవ్రంగా వస్తుంది. ఏదో ఒక వైపునకు తిరిగి పడుకున్నప్పుడు ఈ సమస్య ఉండదు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 17, 2024 / 02:27 PM IST

    Sleeping Tips

    Follow us on

    Sleeping Tips: మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. ప్రతీ వ్యక్తి రోజుకు కనీసం 7 గంటల పాటు నిద్రిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. కానీ నేటి కాలంలో ఒత్తిడి పెరిగిపోతుండడంతో చాలా మంది సరైన నిద్ర పోవడం లేదు. దీంతో అనేక అనారోగ్యాల పాలవుతున్నారు. అయితే కొందరు 7 గంటల పాటు నిద్రిస్తున్నా వ్యతిరేక దిశలో పడుకోవడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. సరైన భంగిమల్లో నిద్రించకపోవడంతో వారి శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఎలాంటి అనారోగ్యం లేనివారు ఎలా పడుకున్నా పర్వాలేదు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ భంగిమల్లో నిద్రిస్తే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    కొందరు నిద్రిస్తున్నప్పుడు విపరీతమైన గురక పెడుతారు.ఉబకాయంతో బాధపడేవారిలో ఇది అధికంగా ఉంటుంది. అయితే వారు వెల్లకిలా పడుకున్నప్పుడు గురక తీవ్రంగా వస్తుంది. ఏదో ఒక వైపునకు తిరిగి పడుకున్నప్పుడు ఈ సమస్య ఉండదు. ముఖ్యంగా అధిక బరువు, గుండె సమస్యలు, శ్వాస సమస్యలు ఉన్న వారు ఎడమ వైపు నిద్రించడం మంచిది. ఇలా నిద్రిస్తే వారు శ్వాస తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు. దీంతో వారు గురక పెట్టే సమస్య ఉండదు.

    చాలా మందికి బొర్లా పడుకోవడం కంపోర్టుగా భావిస్తారు. అయితే ఇది యవ్వనంలో ఉండేవారికి ఎటువంటి సమస్యగా ఉండదు. కానీ 50 సంవత్సరాల పైబడిన వారు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇలా నిద్రించడం వల్ల వారి జీర్ణక్రియ సక్రమంగా ఉండదు. బరువు ఎక్కువగా ఉన్నవారు బొర్లా పడుకుంటే ఊపిరితిత్తులపై వెయిట్ పడి శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల బొర్లా పడుకోవడం మంచిది కాదు.

    అధిక బరువు, శ్వాస సమస్యలు లేని వారు వెల్లకిలా పడుకోవడం మంచిది. ఇలా నిద్రించేవారికి నడుం నొప్పి, మెడ నొప్పి సమస్యలు రాకుండా ఉంటారు. అలాగే వెరీకోన్స్ వెయిన్స్ వంటి సమస్యలతో బాధపడేవారు పాదాల కింద దిండు పెట్టుకొని నిద్రించాలి. ఇలా చేస్తే పాదాలు వాపులు రాకుండా ఉంటాయి. ఎలంటి భంగిమల్లో నిద్రిస్తున్నా ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. లేకుంటే ఆ నిద్రకు ఫలితం ఉండదు.