Drinking Water: తులసి ఆకులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. వీటివల్ల ఆరోగ్యం బాగుంటుంది అంటారు ఆయుర్వేద నిపుణులు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి మేలు చేస్తుంది తులసి. ఈ ఆకులను రాత్రి మొత్తం నానబెట్టి ఉదయమే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. తులసిలో అడాప్టోజెనిక్ గుణాలు ఉన్నాయి. అంటే శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి తులసి నీరు సహాయపడుతుంది. తులసీ నీటి ఉపయోగాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు నిండివున్న తులసి రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. వేసవిలో తులసి నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగాలి అంటున్నారు నిపుణులు. ఇలా తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపునొప్పి, గ్యాస్, అసిడిటీ వంటి అసౌకర్యాల నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు శరీరాన్ని శుభ్రపరచడంలో, ఆరోగ్యకరమైన జీర్ణ ప్రక్రియను ప్రారంభించడంలో మేలు చేస్తుంది తులసి నీరు. దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో, తులసి నీరు దగ్గు, జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా బలోపేతం చేస్తుంది.
తులసి ఆకులు సహజమైన డిటాక్సిఫైయర్. ఉదయాన్నే పరగడుపున తులసి నీటిని తాగడం వల్ల డిటాక్సిఫికేషన్ జరుగుతుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ సంబంధ వ్యాధులు దూరంగా ఉంటాయి.
తులసి నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి సహాయం చేస్తాయి తులసి నీటిని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
అధ్యయనాల్లో తులసి నీరు కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందని తెలుస్తోంది ఇది శరీరంలో ఒత్తిడిని కలిగించే ఒత్తిడి హార్మోన్ అని పేరుసంపాదించింది. తులసి నీటిని తాగడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే మీరు ఒత్తిడి లేకుండా ఉండేందుకు సహాయపడుతుంది.