https://oktelugu.com/

Drinking Beer: బీరు తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందా? షాకింగ్ నిజాలు

Drinking Beer: మద్యం, మగువ రెండూ ప్రమాదమే. ఒకటి శరీరాన్ని మరొకటి మనసును వేధిస్తాయి. ఈ మధ్య కాలంలో మందు తాగడం ఓ స్టేటస్ గా ఫీలవుతున్నారు. మందు తాగనివాడిని చీఫ్ గా చూస్తున్నారు. ఎంత తాగితే అంత స్టేటస్ ఉన్న వాడిగా చూసే సంస్కృతి పెరుగుతోంది. దీంతో మద్యం తీసుకోవడానికే అందరు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంట్లో ఏం ఉన్నా లేకున్నా సంఘంలో మాత్రం మద్యం తాగుతూ తన ప్రతాపం చూపించుకుంటున్నారు. దీంతో తాగుబోతులుగా ముద్ర పడుతున్నా […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 22, 2021 / 10:05 AM IST
    Follow us on

    Drinking Beer: మద్యం, మగువ రెండూ ప్రమాదమే. ఒకటి శరీరాన్ని మరొకటి మనసును వేధిస్తాయి. ఈ మధ్య కాలంలో మందు తాగడం ఓ స్టేటస్ గా ఫీలవుతున్నారు. మందు తాగనివాడిని చీఫ్ గా చూస్తున్నారు. ఎంత తాగితే అంత స్టేటస్ ఉన్న వాడిగా చూసే సంస్కృతి పెరుగుతోంది. దీంతో మద్యం తీసుకోవడానికే అందరు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంట్లో ఏం ఉన్నా లేకున్నా సంఘంలో మాత్రం మద్యం తాగుతూ తన ప్రతాపం చూపించుకుంటున్నారు. దీంతో తాగుబోతులుగా ముద్ర పడుతున్నా తమకు ఇబ్బందేమీ లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం తాగేవారి సంఖ్య రానురాను విపరీతంగా పెరుగుతోంది.

    ఏదో విందులోనో పుట్టినరోజు వేడుకలోనో, పెళ్లిలోనే అయితే ఓకే కానీ దినదిననం మందు తాగడమే ఒక అలవాటుగా చేసుకుని ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. అల్కాహాల్ తీసుకునే వారి సంఖ్య పెరగడంతో ప్రభుత్వానికి సైతం ఆదాయం ఘనంగానే ముడుతోంది. దీంతో ప్రభుత్వం తన మనుగడ కోసం మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడి చేస్తోంది. దీంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మద్యం బాటిల్ మీద రాసే ఉంటుంది. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్ వేసి మరీ అమ్మడం చూస్తుంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమే అని తెలుస్తోంది.

    ఇటీవల కాలంలో యువత బీరు తాగడానికి మొగ్గు చూపుతున్నారు. బీరుతో ఆరోగ్యానికి మంచిదే అనే అభిప్రాయంతోనే ఎక్కువగా తాగేందుకు ఇస్టపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీరు తాగడం వల్ల ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఫలితంగా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. కొంచెంగా తీసుకుంటే ముప్పు లేదని నిపుణులు సూచిస్తున్న సందర్భంలో మద్యం తాగడం అలవాటుకు ఓటు వేస్తున్నారు. దీంతో తమ ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

    ఈ మధ్య మద్యం సేవించడం పరిమితంగా ఉండడం లేదు. అపరిమితంగానే తీసుకుంటున్నారు. తాజాగా ఓ అధ్యయనంలో కొద్దిగా బీరు తీసకుని శృంగారంలో పాల్గొనే మగవారికి పట్టు పెరిగిందని తెలిసిందని వెల్లడించాయి. దీంతో పురుషులు ఎక్కువ బీరు తాగడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం. అసలు మద్యం తాగడమే చెడ్డ అలవాటు. అంటే అందులో ఏవో అధ్యయనాలు అంటూ పక్కదారి పట్టించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మద్యం అలవాటును పూర్తిగా మానేస్తేనే మంచిదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.