దేశంలో కరోనా కేసులు తగ్గాయి. తాజాగా 30 వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 26,964 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. 383 మంది మరణించారు. దాంతో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరగా 445 లక్షల మరణాలు నమోదయ్యాయి.
కేరళలో 15వేలు, మహారాష్ట్రలో 3 వేల మందికి కరోనా సోకిందని బుధవారం కేంద్రం వెల్లడించింది. క్రియాశీల కేసులు రోజురోజుకూ తగ్గుతుండటం సానుకూలాంశం. ప్రస్తుతం 3,01,989 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు.
క్రియాశీల కేసుల రేటు 0.90 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97,77 శాతానికి పెరిగింది. నిన్న ఒక్క రోజే 34 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.27 కోట్లకు చేరాయి. కాగా, ఆగస్టు చివర్లో ఒకటి కంటే ఎక్కువగా నమోదైన ఆర్ వ్యాల్యూ.. సెప్టెంబర్ మధనాటికి 0.92కి తగ్గడం ఊరటనిస్తోంది. మరోపక్క నిన్న 75,57,259 మంది టీకా వేయించుకున్నారు.