https://oktelugu.com/

రాత్రి యాపిల్‌, అరటి పండు తినడం మంచిది కాదా.?

పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఏదైనా ఇబ్బందితో డాక్టర్‌‌ వద్దకు వెళ్తే ముందు వారు చెప్పేది టాబ్లెట్స్‌తో పాటు పండ్లు తీసుకోవాలి అని సూచిస్తుంటారు. అసలే ఇప్పుడు కరోనా టైం నడుస్తోంది. ఈ టైంలో ఇమ్యునిటీ పవర్‌‌ పెంచుకోవాలన్నా ఫ్రూట్స్‌ కంపల్సరీ తినాల్సిందే. కానీ.. ఫ్రూట్స్‌ తినడానికి ఓ టైం ఉందంటున్నారు ఆహార నిపుణులు. రాత్రి వేళల్లో అయితే అస్సలే తినొద్దని సూచిస్తున్నారు. Also Read: కరివేపాకు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలో తెలుసా? అదేంటి? […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 10:44 am
    apple banana

    apple banana

    Follow us on

    apple banana
    పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఏదైనా ఇబ్బందితో డాక్టర్‌‌ వద్దకు వెళ్తే ముందు వారు చెప్పేది టాబ్లెట్స్‌తో పాటు పండ్లు తీసుకోవాలి అని సూచిస్తుంటారు. అసలే ఇప్పుడు కరోనా టైం నడుస్తోంది. ఈ టైంలో ఇమ్యునిటీ పవర్‌‌ పెంచుకోవాలన్నా ఫ్రూట్స్‌ కంపల్సరీ తినాల్సిందే. కానీ.. ఫ్రూట్స్‌ తినడానికి ఓ టైం ఉందంటున్నారు ఆహార నిపుణులు. రాత్రి వేళల్లో అయితే అస్సలే తినొద్దని సూచిస్తున్నారు.

    Also Read: కరివేపాకు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలో తెలుసా?

    అదేంటి? యాపిల్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు కదా? రాత్రి వేళ్లల్లో ఎందుకు తినొద్దు అంటున్నారనేగా మీ సందేహం? యాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదే. రోజూ యాపిల్ తినడం వల్ల అందులోని పెక్టిన్ సాల్యుబుల్ అనే ఫైబర్ పదార్థం చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. యాపిల్ పండులో ఉండే విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. క్యాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధిత వ్యాధులు, అల్జీమర్స్‌ తదితర వ్యాధులతో పోరాడే శక్తిని యాపిల్ శరీరానికి అందిస్తుంది.

    కానీ.. యాపిల్‌ నైట్‌ తినడం అంత మంచిది కాదంట. యాపిల్‌లో పోషకాలే కాదు.. యాసిడ్స్ కూడా ఉంటాయంట. రాత్రి వేళ యాపిల్ తిన్నట్లయితే కడుపులో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై భారం పడేలా చేస్తుంది. పెక్టిన్ వల్ల ఎసిడిటీ కూడా ఏర్పడుతుంది. అందుకే.. యాపిల్‌ను ఉదయం టిఫిన్ తిన్న తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

    Also Read: వర్షకాలంలో ఇవి తింటే డేంజరట..

    ఇక అరటి పండు తింటే రోగ శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఫలితంగా బీపీ అదుపులో ఉంటుంది. అరటి పండులోని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్సర్ సమస్యలను సైతం అరటి పండు దూరం చేస్తుంది. కానీ రాత్రిపూట తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడి జలుబుకు దారితీస్తుందట. ఈ వైరస్ సీజన్లలో జలుబు చేస్తే అంత సులభంగా తగ్గదు. అంతేకాదు.. అరటి పండును పరగడుపున కూడా తీసుకోకూడదు. ఎందుకంటే.. ఇందులో ఉండే అత్యధిక చక్కెరలు తక్షణ శక్తిని అందించినా, అంతే త్వరగా అలసటకు గురిచేస్తాయి. అరటి పండిలోని ఆమ్లతత్త్వం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తవచ్చు. మధ్యాహ్నం పూట తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.