బిగ్ బాస్: కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయింది?

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ గత మూడు సీజన్లలో అత్యధిక టీఆర్పీ రేటింగులతో తెలుగులో నంబర్ 1 షోగా నిలిచింది. రియల్ ఎమోషన్, ఏడుపులు, పెడబొబ్బలు, రోమాన్స్ ఇలా బిగ్ బాస్ ప్రేక్షకులకు చేరువైంది. మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని, మూడో సీజన్ నుంచి నాగార్జున దీన్ని చేపట్టారు. Also Read: బాలయ్యతో నటిస్తా కానీ.. హీరోయిన్ డిమాండ్ ! నాలుగో సీజన్ కరోనా కష్టాలను దాటి పట్టాలెక్కబోతోంది. ఈ ఆదివారం […]

Written By: NARESH, Updated On : September 5, 2020 10:39 am

bigboss 4 participants

Follow us on

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ గత మూడు సీజన్లలో అత్యధిక టీఆర్పీ రేటింగులతో తెలుగులో నంబర్ 1 షోగా నిలిచింది. రియల్ ఎమోషన్, ఏడుపులు, పెడబొబ్బలు, రోమాన్స్ ఇలా బిగ్ బాస్ ప్రేక్షకులకు చేరువైంది. మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని, మూడో సీజన్ నుంచి నాగార్జున దీన్ని చేపట్టారు.

Also Read: బాలయ్యతో నటిస్తా కానీ.. హీరోయిన్ డిమాండ్ !

నాలుగో సీజన్ కరోనా కష్టాలను దాటి పట్టాలెక్కబోతోంది. ఈ ఆదివారం సెప్టెంబరు 6 సాయంత్రం 6 గంటల నుంచి ఇది మొదలు కాబోతోంది. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు? బిగ్ బాస్ టీం ఏ సెలెబ్రెటీలను తీసుకుంది ? అనేది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం బిగ్ బాస్ ఓపెనింగ్ డే షూటింగ్ కూడా పూర్తయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ లకు సంబంధించిన ఓ లీకేజీ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేనని చర్చ జరుగుతోంది.

Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ !

ఈ లిస్ట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న సింగర్ ‘నోయల్’. ఈయన దాదాపు ఖాయం అయినట్టు తెలుస్తోంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటుడు అభిజిత్ ఎంట్రీ కూడా కన్ఫమ్ అయ్యిందట.. కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్, దర్శకుడు సూర్యకిరణ్, టీవీ9 యాంకర్ దేవి నాగవళ్లి, టాలీవుడ్ నటి కరాటే కళ్యాణితోపాటు యూట్యూబర్ గంగవ్వ, హారిక, మెహబూబ్, యాంకర్ అరియానా గ్లోరి, లాస్య, హీరోయిన్ మోనాల్ , నటి సురేఖ వాణిల పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి.