వ్యాయామం ఎక్కువగా చేస్తే కలిగే నష్టాలు తెలుసా..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలనే సంగతి తెలిసిందే. ప్రతిరోజు 30 నిమిషాల నుంచి గంట వరకు వ్యాయామం చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ కాకుండా వారంలో ఐదు రోజుల పాటు గంట వ్యాయామం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడైంది. Also Read: పిల్లలు బరువు పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..? అయితే నిపుణులు అతిగా వ్యాయామం చేయడం వల్ల […]

Written By: Navya, Updated On : January 7, 2021 10:56 am
Follow us on


మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలనే సంగతి తెలిసిందే. ప్రతిరోజు 30 నిమిషాల నుంచి గంట వరకు వ్యాయామం చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ కాకుండా వారంలో ఐదు రోజుల పాటు గంట వ్యాయామం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడైంది.

Also Read: పిల్లలు బరువు పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?

అయితే నిపుణులు అతిగా వ్యాయామం చేయడం వల్ల నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదని చెబుతున్నారు. ఎక్కువ సమయం వ్యాయామం చేయడం వల్ల అలసిపోవడంతో పాటు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సమయం వ్యాయామం చేస్తారో వారిలో త్వరగా శక్తి తగ్గిపోవడంతో పాటు వాళ్లు వేరే పనులను సులభంగా చేయడం సాధ్యం కాదు. అవసరానికి మించి వ్యాయామం చేస్తే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది.

Also Read: పొట్ట తగ్గాలంటే ఈ ఆహారం తీసుకోండి!

ఎక్కువ సమయం వ్యాయామం చేయడం వల్ల వ్యాయామం చేసే శక్తి క్రమంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సమయం వ్యాయామం చేయాలంటే విరామం ఎక్కువగా తీసుకుని చేస్తే మంచిది. అతిగా వ్యాయామం చేస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇతర సమస్యలు వెంటాడే అవకాశం ఉంటుంది. అతి వ్యాయామం వల్ల ఎముకలు, లిగమెంట్లు, కండరాలకు గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఓవర్‌ ఎక్సర్‌ సైజింగ్ కొన్ని సందర్భాల్లో కండరాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులకు కారణమవుతాయి. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు కరోనా లక్షణాలు కనిపిస్తే వ్యాయామం చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.