https://oktelugu.com/

విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు.. చిక్కుల్లో కెప్టెన్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. అనవసరంగా ఓ ప్రైవేటు లీగులో పెట్టుబడి పెట్టి ఎరక్కపోయి ఇరుకున్నాడు. ఇప్పుడు బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని.. చర్య తీసుకుంటారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Also Read: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత జట్టు ఇదే? మొన్న ఐపీఎల్ లో ‘ఎంపీఎల్’ అంటూ మన క్రికెటర్లందరూ కనిపించిన యాడ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందరిలోకి విరాట్ కోహ్లీ యాడ్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 7, 2021 4:43 pm
    Follow us on

    Virat Kohli

    భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. అనవసరంగా ఓ ప్రైవేటు లీగులో పెట్టుబడి పెట్టి ఎరక్కపోయి ఇరుకున్నాడు. ఇప్పుడు బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని.. చర్య తీసుకుంటారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    Also Read: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత జట్టు ఇదే?

    మొన్న ఐపీఎల్ లో ‘ఎంపీఎల్’ అంటూ మన క్రికెటర్లందరూ కనిపించిన యాడ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందరిలోకి విరాట్ కోహ్లీ యాడ్స్ ఎక్కువగా వచ్చాయి. దీనిపై అసలు విషయం ఆరాతీయగా సంచలనం బయటపడింది.

    విరాట్ కోహ్లీ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)లో పెట్టుబడి పెట్టిన విషయం బయటపడింది. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కోహ్లీకి అందులో 0.051శాతం వాటా ఉన్న విషయం వెలుగుచూసింది.దీంతో కోహ్లీ బీసీసీఐ రూల్స్ ను తుంగలో తొక్కినట్టైంది. అతడిపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల పేరిట ఆరోపణలు వస్తున్నాయి.

    Also Read: ఆస్ట్రేలియా vs ఇండియా: సిడ్నీ టెస్టుకు పొంచి ఉన్న ముప్పు?

    గత ఏడాది అధికారిక కిట్ స్పాన్సర్ గా ఇదే ఎంపీఎల్ ను బీసీసీఐ ప్రకటించడం గమనార్హం. అసీస్ టూర్ లో కోహ్లీ అదే లోగో ఉన్న జెర్సీతో ఆడటాన్ని అందరూ విమర్శలు గుప్పించారు. అయితే అసలు విషయం తాజాగా వెలుగుచూసింది.