https://oktelugu.com/

తప్పుకున్న రానా.. కారణం అదే..

సంక్రాంతికి వస్తాడనుకున్న హీరో రానా ఆ బరి నుంచి తప్పుకున్నాడు. రానా హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా ‘అరణ్య’ మూవీ రూపొందింది. ఇది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి మూవీ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి ‘అరణ్య’ రిలీజ్ కావడం లేదని స్వయంగా హీరో రానా ప్రకటించాడు. Also Read: ‘ఆచార్య’ మూవీలోని మరో రహస్యాన్ని బయటపెట్టిన చిరంజీవి కానీ పోటీగా కొన్ని సినిమాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2021 / 10:12 PM IST
    Follow us on

    సంక్రాంతికి వస్తాడనుకున్న హీరో రానా ఆ బరి నుంచి తప్పుకున్నాడు. రానా హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా ‘అరణ్య’ మూవీ రూపొందింది. ఇది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి మూవీ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి ‘అరణ్య’ రిలీజ్ కావడం లేదని స్వయంగా హీరో రానా ప్రకటించాడు.

    Also Read: ‘ఆచార్య’ మూవీలోని మరో రహస్యాన్ని బయటపెట్టిన చిరంజీవి

    కానీ పోటీగా కొన్ని సినిమాలు సంక్రాంతికి రావడం.. 50శాతం అక్యుపెన్సీతోనే సినిమాలు నడవాలన్న ప్రభుత్వ ప్రకటనతో ప్యాన్ ఇండియా సినిమాకు నష్టం అని అరణ్య మూవీ టీం సినిమాను వాయిదా వేసింది.

    నిజానికి ఈ సంక్రాంతికి రానా అరణ్య సినిమాను ప్లాన్ చేశారు. అయితే తెలుగులో ఇప్పటికే ‘క్రాక్’, రెడ్ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ కు అల్ రెడీ ప్రకటించాడు. దీంతోపాటు తమిళనాడులో విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీని కూడా సంక్రాంతికే లాక్ రాశారు. దీంతో రానా వెనక్కి తగ్గాడు.

    Also Read: జబర్దస్త్ కి వస్తానంటే వద్దంటున్నారట !

    దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుండడంతో 50శాతం ఆక్యుపెన్సీ తోనే థియేటర్లు ఇప్పుడు నడుస్తుండడంతో ఇప్పుడు రిలీజ్ చేస్తే నష్టం అని భావించి నాలుగు సెలవులు వస్తున్న మార్చి 26కు రిలీజ్ చేస్తున్నారు. ‘హోలీ’ పండుగ, శని, ఆదివారాలు కలిసి రావడంతో ఆ తేదిని లాక్ చేశారు. మరి ఈ ప్యాన్ ఇండియా మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్