Stomach Health: ఉదయం లేవనే చాలామందికి కడుపు టైట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే అలసటగా ఉంటుంది. కనీసం నడవడానికి కూడా ఓపిక ఉండదు. గత రాత్రి వారు తీసుకున్న ఆహారంతోనే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎలాంటి పానీయం తీసుకోవాలి?
ప్రస్తుత కాలంలో ఇంటి ఫుడ్ కంటే బయట ఆహారం ఎక్కువగా తింటూ ఉన్నారు. బయట దొరికే ఆహారంలో మసాలాలు ఎక్కువగా వాడుతున్నారు. దీంతో కడుపులో అసిడిటీ ఏర్పడి కడుపు ఉబ్బరంగా ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాత్రి నుంచి ఉదయం వరకు అలాగే ఉంటుంది. పులుపు వస్తువులు ఎక్కువగా తీసుకున్న వారిలోనూ ఈ సమస్య ఉంటుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం.. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం.. ఆల్కహాల్ తీసుకునే వెంటనే నిద్రపోవడం.. వంటివి చేయడం వల్ల ఉదయమే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తోచదు.
అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య వెంటనే మటుమాయం అవుతుంది. ఉదయం కడుపు ఉబ్బరంగా ఉన్నవారు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. రాత్రి సమయంలో తీసుకున్న ఆహారం ఒకవేళ పేరుకు పోతే.. గోరువెచ్చని మీరు తాగడం వల్ల కడుపు క్లీన్ గా మారుతుంది. అయితే ఈ గోరువెచ్చటి నీటిలో కాస్త నేను కలుపుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. అలాగే జీలకర్ర కలిపిన నీరును తీసుకున్నా.. కూడా ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే జీలకర్రకు జీర్ణమయ్యే శక్తి ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకున్న కూడా జిలకర నీటితో జీర్ణక్రియ పెంపొందుతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్న సమయంలోనే కాకుండా సాధారణ సమయాల్లో కూడా జీలకర్ర నీటిని తీసుకుంటూ ఉండాలి. ఇలా నీరు తీసుకున్న తర్వాత తేలికైన వ్యాయామం చేయాలి. అయితే వ్యాయామం వేగంగా చేయడం వల్ల మరింతగా కడుపు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. కాసేపు తేలికగా వ్యాయామం చేసి కుదుటపడ్డాక ఆ తర్వాత వేగాన్ని పెంచుకోవాలి.
అయితే కొందరు ప్రతిరోజు తీసుకునే ఆహారంతోనే ఈ సమస్య వస్తుంటుంది. ఎక్కువగా పులుపు వస్తువు తీసుకునే వారిలో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అలాగే వేడి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. ఒకవేళ ఫ్రైడ్ ఐటమ్స్ లేదా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వస్తే.. ఆ తర్వాత వెంటనే పెరుగు లేదా మజ్జిగ తీసుకుని ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్రై ఐటమ్స్ కడుపులో సమస్యలు సృష్టించకుండా కాపాడుతాయి. ప్రతిరోజు ఉదయం ఆయనతో కూడిన బ్రేక్ఫాస్ట్ చేయకుండా జాగ్రత్తపడాలి. ఉదయం కేవలం సాఫ్ట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి.