https://oktelugu.com/

Kidney Stones: పాలకూర టమాట తింటే కిడ్నీలో రాళ్లు పెరుగుతాయా?

మిక్సింగ్ చేసి తింటే ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుందట. ప్రతి కూరగాయల నుంచి శరీరానికి ఏదో ఒక రకమైన హెల్ప్ అందుతుంటుంది.కానీ కొన్ని కలిపి చేయడం వల్ల మాత్రం నెగిటివ్ ఫలితాలు వస్తుంటాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 10, 2024 / 03:34 PM IST

    Kidney Stones

    Follow us on

    Kidney Stones: ఆకుకూరలు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటి వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి. తద్వార శరీరాన్ని వ్యాధుల సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. కానీ కొందరు ఆకుపచ్చని కూరగాయల కంటే ఎక్కువ రెస్టారెంట్లు, హోటల్స్ నుంచి ఆర్డర్స్ పెట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మోతాదు మించితే ప్రతి ఒక్క ఆహార పదార్థం కూడా విషమే అవుతుంది. మరో విషయం ఏంటంటే.. కొన్ని ఆహార పదార్థాలను విడి విడిగా తింటేనే మంచిది.

    మిక్సింగ్ చేసి తింటే ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుందట. ప్రతి కూరగాయల నుంచి శరీరానికి ఏదో ఒక రకమైన హెల్ప్ అందుతుంటుంది.కానీ కొన్ని కలిపి చేయడం వల్ల మాత్రం నెగిటివ్ ఫలితాలు వస్తుంటాయి. ఇందులో భాగంగా టమాట పాలకూరను కలిపి వండవద్దు అంటారు కొందరు. ఇలా మిక్స్ చేసి వండితే రాళ్లు అవుతాయని కూడా అంటారు. అంతేకాదు ఎగ్ కర్రీ వండినా అందులో టమాటాను కలపవద్దు అంటారు. మరి పాలకూర టమాట కలిపి వండడం వల్ల నిజంగానే ఏమైనా సమస్యలు వస్తాయా? ఓ సారి చదివేసేయండి.

    పాలకూర టమాట తినడం వల్ల ఎలాంటి నష్టం జరగదు అంటున్నారు నిపుణులు. ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు నిపుణులు. అయితే పాలకూరలో ఈ ఆక్సలేట్స్ 750 మి.గ్రాములు ఉంటే.. టమాటోలో 150 మి. గ్రాముల ఆక్సలేట్స్ ఉంటాయి. అందుకే పాలకూర టమాట తింటే రాళ్లు వస్తాయి అంటారు. అయితే పాలకూర టమాట వండటం వల్ల 80 శాతం ఆక్సలేట్స్ నశిస్తాయట. కేవలం 40-50 శాతం మాత్రమే పేగుల్లోకి వెళ్తాయట.

    60 శాతం విసర్జనలో వెళ్లిపోతాయి అంటారు నిపుణులు. రక్తం లోపలికి వెళ్లినా కూడా లివర్ హ్యాండిల్ చేసి అందులో 15 శాతం బ్లడ్ లోకి పంపిస్తుందట. మిగతా వాటిని మోషన్ ద్వారా బయటకు పంపిస్తుందట. ఈ మెకానిజం వల్లనే పాలకూర టమాట తిన్నా కూడా రాళ్లు రావు అంటున్నారు నిపుణులు. అందుకే స్టోన్స్ ఉన్న వారు అయినా లేని వారు అయినా కూడా ఈ పాలకూర టమాటాను తినవచ్చు.