ఉల్లిగడ్డ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందా.. నిపుణులేమన్నారంటే?

దేశంలో ప్రస్తుతం ఎంతోమంది కరోనాతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లతో పోలిస్తే థర్డ్ వేవ్ లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. సామాజిక దూరాన్ని కొనసాగించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. కొన్ని వారాల క్రితం ముడి ఉల్లిపాయ, నల్ల ఉప్పు […]

Written By: Navya, Updated On : June 20, 2021 8:30 pm
Follow us on

దేశంలో ప్రస్తుతం ఎంతోమంది కరోనాతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లతో పోలిస్తే థర్డ్ వేవ్ లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. సామాజిక దూరాన్ని కొనసాగించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

కొన్ని వారాల క్రితం ముడి ఉల్లిపాయ, నల్ల ఉప్పు తినడం వల్ల వైరస్‌ని చంపలేమని పీఐబీ ఫాక్ట్ చెక్ ట్విట్టర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ పోషకాహార నిపుణుడు ల్యూక్ కౌటిన్హో తాజాగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి ఒక మార్గాన్ని వెల్లడించారు. పచ్చి ఉల్లిపాయ తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని ఆయన చెబుతుండటం గమనార్హం. ముడి ఉల్లిపాయను భోజనంతో తినడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని పెంచుకోచ్చని ఆయన తెలిపారు.

అసిడిటీతో బాధ పడుతుంటే మాత్రం ఉడికించుకుని తినాలని ఆయన సూచనలు చేశారు. ఉల్లిపాయలలో విటమిన్లు పుష్కలంగా ఉండటంతో పాటు ఫోలేట్ (బి 9), పిరిడాక్సిన్ (బి 6) ఉంటాయి. జీవక్రియ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నరాల పనితీరులో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఉల్లిపాయలో 5 రకాలైన ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో తోడ్పడతాయి.

ఉల్లిపాయ రోగనిరోధక శక్తిని పెంచుతుందని పరిశోధనలో తేలింది. మంటతో పోరాడటంలో ఉల్లిపాయ సహాయపడుతుంది. ఉల్లిపాయ రుచిగా లేకపోతే దానికి నిమ్మరసం జోడిస్తే మంచిది.