కరోనా రెండో దశ ప్రజల్నిఎంత ఇబ్బందులకు గురి చేసిందో మనందరికి తెలుసు. సెకండ్ వేవ్ లో విజృంభించిన వైరస్ కొత్త మ్యూటేషన్ మూడో వేవ్ లో వ్యాపిస్తుందని అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్ లో ప్రభావం చూపిన వైరస్ రకం డెల్టా అని, డెల్టా ప్లస్ వేరియంట్ రాబోతోందని చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పటికే వచ్చేసిందని ఇది డెల్టా కన్నా తీవ్ర ప్రమాదకారి అంటున్నారు. ఇలా పలు రకాల విశ్లేషణలు, అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
మూడో దశ ఇంతకి ఎప్పుడు రాబోతోందనే అంశంపై విభిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ కనీసం మూడు నెలల తరువాత రావొచ్చని చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టసాగాయి. అక్టోబర్, నవంబర్ నెలలు గడిచేసరికకి కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గింది. డిసెంబర్ నెలలో ప్రజలు మాస్కులు తీసేశారు. ఆ తరువాత జనవరి, ఫిబ్రవరి వరకు కూడా సౌత్ లో కరోనా ప్రభావం లేదు.
ఈ పరిణామాల్లో జులై నుంచి అక్టోబర్ నెలల తరువాత కరనా న్యూ వేరియంట్ మరో వేవ్ లో వ్యాపించే అవకాశం ఉంటుందని కొన్ని అంచనాలున్నాయి. అయితే ఎయిమ్స్ చీఫ్ గులేరియా మాత్రం అంత గ్యాప్ ఇవ్వదంటున్నారు. ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ఇండియాలో కరనా మరో వేవ్ విరుచుకుపడుతుందని చెబుతున్నారు.
కరోనా ఇక వేగవంతంా రూపాంతరం చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దశకు దశకు మధ్య దూరం తగ్గుతుందని తెలుస్తోంది. గరిష్టంగా ఎనిమిది వారాల్లోనే ఇండియా మూడో దశ ఎధుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నరు. అన్ లాక్ ప్రక్రియ వేగంగా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.