https://oktelugu.com/

రేషన్ కార్డును సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

మన దేశంలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన కార్డులలో రేషన్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందె. ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే కేటాయించిన రేషన్ దుకాణంలో మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేది. వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ ను కేంద్రం అమలు చేస్తుండటంతో దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ ను తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డును పోగొట్టుకున్నా సులభంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం రెండు నిమిషాల్లో ఆన్ లైన్ ద్వారా సులభంగా కార్డును […]

Written By: Kusuma Aggunna, Updated On : June 21, 2021 11:23 am
Follow us on

మన దేశంలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన కార్డులలో రేషన్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందె. ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే కేటాయించిన రేషన్ దుకాణంలో మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేది. వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ ను కేంద్రం అమలు చేస్తుండటంతో దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ ను తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డును పోగొట్టుకున్నా సులభంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

కేవలం రెండు నిమిషాల్లో ఆన్ లైన్ ద్వారా సులభంగా కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునే వారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పటికే రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు https://nfsa.gov.in/ వెబ్ సైట్ ద్వారా రేషన్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డును డౌన్ లోన్ చేసుకోవాలనుకునే వాళ్లు మొదట https://nfsa.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

వెబ్ సైట్ లో “వ్యూ రేషన్ కార్డు-డాష్ బోర్డు”ను ఎంచుకుని ఏ రాష్ట్రం అయితే రాష్ట్రాన్ని, ఆ తరువాత జిల్లాను ఎంచుకోవాలి. ఆ తరువాత మన ఊరి వివరాలను ఎంచుకుని పట్ణణ ప్రాంతమా? గ్రామీణ ప్రాంతమా? అన్నది క్లిక్ చేయాలి. అందులో తహసీల్దార్, ప్రాంతం, బ్లాక్ వివరాలు ఉంటాయి. అందులో మీ కార్డు ను ఎంచుకొని క్లిక్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి. ఆ కార్డును ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది.

ఈ విధంగా రేషన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా సంబంధిత రాష్ట్రాల వెబ్ సైట్ల ద్వారా రేషన్ కార్డును పొందవచ్చు. ఏపీకి చెందిన వాళ్లు రేషన్ కార్డును పోగొట్టుకుంటే సమీపంలోని గ్రామ సచివాలయంలోని అధికారులను సంప్రదించి రేషన్ కార్డ్ పొందే అవకాశం ఉంటుంది.