https://oktelugu.com/

Doctors: ఈ విషయాల గురించి డాక్టర్లు పేషెంట్లతో అసలు చెప్పరట..

ఒకరికి విషం, మరొకరికి ఔషధం.. సన్నగా, ఎముకలు బయటకు కనిపించే శరీరం అంటే ఎక్టోమార్ప్ గల వారు ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 11, 2024 / 02:33 PM IST

    Doctors

    Follow us on

    Doctors: ఆరోగ్యం పాడైతే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. వారు కూడా వ్యాధికి సంబంధించిన మందులు ఇస్తారు. అయితే చాలా మంది డాక్టర్లు మంచి ఆహారం తీసుకోండి అని సలహా ఇస్తారు. కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి అంటూ కొన్ని విషయాల గురించి విడమర్చి చెప్పరు. అయితే కొన్ని విషయాలను పేషెంట్లకు డాక్టర్లు అసలు చెప్పరట. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి.

    మందులతో పాటు ఆహారం..
    కొన్ని వ్యాధులకు మందులు మాత్రమే పరిష్కారం కాదట.. మందులు వేసుకున్నా ఆహారం కూడా సరిగ్గా తీసుకోవాలట. లేదంటే ఫలితం ఉండదు అని తెలుస్తుంది. షుగర్, పీసీఓఎస్, థైరాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి మందులతో పాటు ఆహారం ముఖ్యం. ఆ వ్యాధులకు కారణమయ్యే ఆహారాలను అసలు ముట్టుకోవద్దట.

    ఒకరికి విషం, మరొకరికి ఔషధం.. సన్నగా, ఎముకలు బయటకు కనిపించే శరీరం అంటే ఎక్టోమార్ప్ గల వారు ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. తియ్యటి, పుల్లటి, ఉప్పు, మంచి కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవచ్చు. శరీరాన్ని బట్టి ఆహార అలవాట్లు ఉండాలట. ఎండోమార్ఫ్ అంటే స్థూలకాయం, కొవ్వు ఉండే శరీరం గల వారు తక్కువ పిండిపదార్థాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాట.

    మందులు బలమైనవే. కానీ వాటిని ఎంత కాలం వాడతారు, ఏ ఔషధాలతో కలిపి తీసుకుంటున్నారు? అనే విషయాలను బట్టి మంచి చెడులు ఉంటాయట. చాలా మందుల మీద ఎక్కువ కాలం వాడితే కాలేయానికి హానీ అని రాసి మరీ ఉంటుంది. పారాసిటామల్ వల్ల, గర్భనిరోధక మాత్రల వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే డాక్టర్ ను ఈ విషయం అడిగి తెలుసుకోవడం ముఖ్యం. మందులు వాడుతున్నప్పుడు ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్ మానేయాలి. దీని వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. సో డాక్టర్లు చెప్పని ఈ విషయాల గురించి మీరే అవగాహన పెంచుకోవాలి.