https://oktelugu.com/

Parents: పిల్లల వద్ద తల్లిదండ్రులు ఎలా ఉండాలి?

కొన్ని సార్లు మీ అమ్మానాన్న ఇలాగే పెంచారా అనే ప్రశ్న చాలా మంది పిల్లలకు ఎదురు అవుతుంది. పిల్లలు చేసే మంచి చెడులకు తల్లిదండ్రులకు కూడా పేరు వస్తుంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 11, 2024 / 02:36 PM IST

    Parents

    Follow us on

    Parents: తల్లిదండ్రులను చూస్తూనే పెరుగుతారు పిల్లలు. ప్రతి బిడ్డకు ముందు గురువు అమ్మనే. మీరు చేసే చాలా పనులు ఆ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంటాయి. అమ్మనాన్న ఎలాంటి పనులు చేస్తే వారిని గమనిస్తుంటారు పిల్లలు. అందుకే కొన్ని విషయాలు, పనులు పిల్లల ముందు చేయకుండా ఉండటమే మంచిది. అయితే పిల్లల ముందు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనుకుంటున్నారా?

    కొన్ని సార్లు మీ అమ్మానాన్న ఇలాగే పెంచారా అనే ప్రశ్న చాలా మంది పిల్లలకు ఎదురు అవుతుంది. పిల్లలు చేసే మంచి చెడులకు తల్లిదండ్రులకు కూడా పేరు వస్తుంటుంది. అందుకే మీ బిహేవియర్ పిల్లల ముందు బెటర్ గా ఉండాల్సిందే. అప్పుడే వారి చిన్న బ్రెయిన్ లో మీ మంచి పనులు నాటుకొని పోతుంటాయి. పిల్లల ముందు ముఖ్యంగా విసుగు, విచారం, కోపం వంటివి ప్రదర్శించకుండా ఉండాలి. దీనివల్ల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు మీకు చెప్పడానికి కూడా భయపడతారు.

    మీ కుంగుబాటు మొహం చూస్తే వారు సంతోషంగా ఉండలేరు. వారి ఇష్టాఇష్టాలను కూడా పక్కన పెడుతారు. వారి జీవితాన్ని వారు సంతోషంగా గడపలేరు. అంతేకాదు వారి లైఫ్ లో చాలా విషయాలను కోల్పోతారు. మీ వరకు ఏ విషయాన్ని తీసుకోని రావాలన్నా భయపడతారు. ఆ దారిలో పిల్లలు తప్పుడు దారులు తొక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు కోపం, విచారం, విసుగును వారి ముందు ప్రదర్శించకపోవడమే బెటర్ అంటారు నిపుణులు.

    ప్రేమ, తన్మయత్వం, ఆనందం వంటివి వారి ముందు ప్రదర్శించే ఫీలింగ్స్. వీటి వల్ల వారు మీతో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అందుకే మంచికి మాత్రమే తల్లిదండ్రులు ఉదాహరణ కావాలి. కానీ చెడుకు ఉదాహరణ కావద్దు అంటారు నిపుణులు. ఆనందం, ప్రేమ వల్ల మీ పిల్లల మనసు హాయిగా ఉంటుంది. ఇంటా బయట కూడా వారు సంతోషమైన జీవితం గడుపుతారు.