Gas Cylinders: దేశంలో గ్యాస్ సిలిండర్ల వినియోగం సంవత్సరంసంవత్సరానికి అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నా వంట గ్యాస్ వినియోగం మాత్రం అస్సలు తగ్గడం లేదు. అయితే గ్యాస్ స్టవ్ పై వంట చేసే సమయంలో తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. గ్యాస్ స్టవ్ పై వంట చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
గ్యాస్ స్టవ్ పై వంట చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ఒక కంపెనీ గ్యాస్ సిలిండర్లకు మరో కంపెనీ రెగ్యులేటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. గ్యాస్ సిలిండర్ ను ఇష్టానుసారం వంచడం లేదా తిప్పడం చేయకూడదు. విద్యుత్ స్విచ్‌లకు, మండే ఆహార పదార్థాలకు గ్యాస్ స్టవ్ ను దూరంగా ఉంచితే మంచిదని చెప్పవచ్చు. వంట చేసిన వెంటనే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ను ఆఫ్ చేయాలి.
Also Read: Rajamouli On Bahubali 3: ‘బాహుబలి 3’లో ఎన్టీఆర్.. ఏ పాత్రలో నటిస్తున్నాడు అంటే ?
గ్యాస్ పైప్ లైన్ లపై ఉండే డేట్ల ఆధారంగా వాటిని మార్చుకుంటూ ఉండాలి. గ్యాస్ వాల్వ్ లను కూడా క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉంటే మంచిదని చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్ ను వెంటిలేషన్ ఎక్కువగా ఉండే స్థలంలో ఉంచాలి. గ్యాస్ లీకవుతున్నట్టు అనిపిస్తే వెంటనే రెగ్యులేటర్ ను ఆఫ్ చేసి సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి సమాచారం అందిస్తే మంచిదని చెప్పవచ్చు.
గ్యాస్ సిలిండర్లను సరిగ్గా నిర్వహించని పక్షంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మన భద్రతతో పాటు కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తే మంచిదని చెప్పవచ్చు.
Also Read: Prabhas Radhe Shyam Movie Box Office Collection: ప్చ్.. ‘రాధేశ్యామ్’ పరిస్థితి మరీ ఇంత దారుణమా ?
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Do you use cooking gas cylinders are you following these precautions
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com