Foods With Most Protein: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కాలంలో ధరలు విపరీతంగా పెరగడంతో ప్రతి ఒక్క వస్తువు కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో ఆహార వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం పౌష్టిక ఆహారం తీసుకోవాలని అంటున్నారు. పౌష్టిక ఆహారం అంటే ఎక్కువ ప్రోటీన్లు కలిగిన ఆహారం. ఇవి అత్యంత ధరతో కలిగి ఉంటాయని చాలామంది వీటిని తీసుకోవడంలో వెనుకడం లేదు. అయితే ఎక్కువగా డబ్బు పెట్టకుండా తక్కువ ధరలోనే పౌష్టిక ఆహారం కూడా లభించే అవకాశం ఉంది. అలాంటి పౌష్టికాహారం ఏంటిదో ఇప్పుడు చూద్దాం.
కోడిగుడ్డు:
ప్రతి ఒక్కరూ కోడిగుడ్డులో ఏముంటుంది? అన్న ఫీలింగ్ తో ఉంటారు. కానీ ఇందులో విటమిన్స్ డి, బి12 ఉంటుంది. దీనివల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. కండరాలు పటిష్టంగా మారుతాయి. చిన్నపిల్లలకు వీలైతే ప్రతి రోజు కోడిగుడ్డు ఇవ్వడం వల్ల వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడంతో ఎముకలు బలంగా మారే అవకాశం ఉంటుంది. తక్కువ ధరలో లభించే పౌష్టికాహార ప్రోటీన్ ఫుడ్ అంటే గుడ్డు అని చెప్పవచ్చు.
పప్పు:
చాలామంది పప్పు అనగానే చిన్నచూపు చూస్తారు. కానీ మాంసాహారకృతులతో సమానంగా పప్పులో అత్యధిక ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ ఉంటుంది. వారానికి కనీసం రెండుసార్లు అయినా పప్పుతో ఆహారం తీసుకోవాలని కొందరు వైద్యులు ప్రత్యేకంగా తెలుపుతున్నారు. పప్పు వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా తక్కువ ధరలో పప్పు తో ప్రోటీన్లను తీసుకునే అవకాశం ఉంటుంది.
పెరుగు:
ప్రతిరోజు ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండే విధంగా కొంతమంది ప్రణాళిక వేసుకుంటారు. పెరుగు తినడం వల్ల కండరాల నిర్మాణం బాగుంటుంది. జీర్ణ క్రియ పెంపొందిస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ బి12, పొటాషియం ఉంటాయి. పెరుగును నేరుగా తినడానికి ఇష్టం లేకపోతే లస్సి లేదా మజ్జిగ లాగా తీసుకొని ప్రోటీన్లు పొందవచ్చు.
ఆకుకూరలు:
ఆకుకూరల్లో అత్యధిక ప్రోటీన్లు ఉంటాయి. వీటిలో మునగాకులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, సి మెగ్నీషియం వంటివి ఉంటాయి. పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. గోంగూరలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పుదీనాలో రక్త శుద్ధి చేసే గుణం ఉంటుంది. పొన్నగంటి కూరలో ఫైబర్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా అత్యధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.
వేరుశెనగలు:
వేరుశనగల్లో అధిక ప్రోటీన్లు ఉంటాయి. 100 గ్రాముల వేరుశనగల్లో సుమారు 25.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చికెన్ మాంసం కంటే ఎక్కువగా ప్రయోజనాలను ఇస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల కండరాలు పెరుగుదల, గుండె ఆరోగ్యం ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ ఈ, b సమృద్ధిగా ఉంటాయి.