Instagram Frauds : సోషల్ మీడియా అనేది ఒక కృత్రిమ ప్రపంచం. అందులో కనిపించే స్నేహాలు, బంధాలు కృతకమైనవి. వాటిని జస్ట్ చూసి వదిలేయాలి. అలా కాకుండా అవి నిజమని భావిస్తే మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత చింతించినా ఉపయోగముండదు. పైగా మోసపోయిన తర్వాత ఏడిస్తే లాభం ఉండదు.
నేటి తరం సోషల్ మీడియాను విపరీతంగా వాడుతోంది. అందులో ఉన్న స్నేహాలను నిజమని భావిస్తోంది. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తులను నిజమైన స్నేహితులుగా భావిస్తోంది. కృత్రిమ ప్రపంచంలో వారు చెప్పేవన్నీ నిజమని భావిస్తోంది. అంతేకాదు, వారు చూపించే ఆప్యాయతను నిజమైన ప్రేమని అనుకుంటుంది. చివరికి నిండా మునిగిపోయిన తర్వాత కన్నీటి పర్యంతమవుతోంది. అటువంటి సంఘటన ఇది కూడా.
ఆ యువతి ఇంటర్ చదువుతోంది. ఆమెకు ఇన్ స్టా లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. మొదట్లో వారిద్దరు నిత్యం చాట్ చేసుకునేవారు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం ప్రపోజ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిత్యం వీడియో కాల్స్ చేసుకునేవారు. ఈ నేపద్యంలోనే విజయవాడ వెళ్లారు. విజయవాడ లో ఓ లాడ్జి కి ఆ యువతిని ఆ యువకుడు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో దగ్గరైన యువకుడు ఇలా చేయడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. వెంటనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి ప్రాంతంలో ఓ మైనర్ పై నలుగురు సామూహిక దారుణానికి పాల్పడ్డారు.
తెలిసీ తెలియని వయసులో యువత సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజమని భావిస్తోంది. అందులో కనిపించే స్నేహాలన్నీ స్వచ్ఛమైనవని అనుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే అటువంటి వ్యక్తులకు దగ్గరై చివరికి నిండా మునిగిపోతుంది. ఈ తరహా ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతున్నప్పటికీ యువతలో మార్పు రావడం లేదు. యువతకు ఫోన్లు దూరంగా పెడితేనే ఇటువంటి పరిస్థితిలో మార్పు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.