Alcohol Combination: మానసిక తృప్తి కోసం మద్యం తాగాలని కొందరు.. గుండెలో ఉన్న ఒత్తిడి తగ్గించుకోవడానికి ధూమపానం చేయాలని ఇంకొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక అడుగు ముందుకేసి ఈ రెండింటిని సేవించేవారు చాలామంది ఉన్నారు. ఒకదానితో ఒకటి మమేకమై రెండు ఉండడం వల్ల ఎంతో ఉత్సాహంగా ఉంటామని భావించేవారు ఉన్నారు. అయితే ఈ ఉత్సాహం కొంతకాలమేనని.. ఆ తర్వాత నిరుత్సాహమేనని అంటున్నారు ఎందుకంటే మద్యపానం, ధూమపానం రెండు శరీరానికి అనారోగ్యమే. ఇవి విడివిడిగా సేవిస్తేనే ప్రాణాంతకంగా ఉంటుంది.. ఇక రెండూ కలిపి వాడడం వల్ల మరింత తొందరగా ఆరోగ్యం పాడై అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇటీవల సిసిఎంబి పరిశోధకులు తేల్చిన అధ్యయనాలు ఏం తెలుపుతున్నాయంటే?
ఆల్కహాల్ తీసుకునేటప్పుడు కొంతమంది ధూమపానం తీసుకోవడం అలవాటు. ఇది మొదట్లో తక్కువగా ఉన్నా.. ఆ తర్వాత ఒకటి లేకుంటే మరొకటి ఉండలేని పరిస్థితికి వస్తుంది. ఒకటి మొదలు పెట్టిన తర్వాత మరొకటి కచ్చితంగా కావాలని మనసు కోరుతుందని ఈ రెండు ఒకదానికి ఒకటి పాలుపంచుకుంటాయని అంటున్నారు. మెదడులోని న్యూరాన్ కణాలు ఒకదానితో ఒకటి సంభాషించుకునే ప్రక్రియను కొనసాగిస్తాయని అంటున్నారు. న్యూరాళ్లు విడుదల చేసే రసాయనాలలో ఆనందం, విశ్రాంతితో సహా అనేక అనుభూతులు ఉంటాయి. వీటిలో ఒక వ్యక్తిని ఉత్తేజ పరచడంలో మరొక వ్యసనానికి కృషి కలుపుతూ ఉంటాయి. అంటే మద్యంతోపాటు ధూమపానం కూడా తీసుకోవాలనే సర్క్యూట్రీని ఆక్టివేట్ చేస్తాయి. మెదడులో ఉండే అతి పెద్ద ఉత్తేజ కరమైన న్యూరో ట్రాన్స్ మీటర్ గ్లూటమేట్. అయితే దీనికి తోడుగా ఉండేది అమినోబ్యూట్రిక్ యాసిడ్. ఈ రెండు కలిసి ఆల్కహాల్, నికోటిన్ తీసుకోవాలని ప్రేరేపిస్తాయి.
అయితే మద్యం తాగేటప్పుడు ధూమపానం చేయడం అత్యంత ఉత్సాహంగా ఫీల్ అవుతారు. కానీ ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల వ్యాధుల ప్రమాదం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు వ్యసనాలు కలిపి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడంతోపాటు మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాటిపై ప్రభావం పడి ఆయుష్షు తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అయితే వీటిని తగ్గించడానికి చేసే ప్రయత్నాలు కూడా సాధ్యం కాదని అంటున్నారు. సాధారణంగా రెండు వేరువేరుగా వ్యసనాలు ఉంటే తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ రెండు వ్యసనాలు అలవాటు ఉన్నవారికి తగ్గించడం ఎంత మాత్రం సాధ్యం కాదని అంటున్నారు. అందువల్ల మద్యపానం లేదా ధూమపానం ఉన్నవారు దీనికి తోడుగా రెండో వ్యసనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది.