India U19 vs Pakistan U19 : భారత అండర్ 19 జట్టుకు మాయ రోగం వచ్చినట్టుంది. మిగతా జట్ల మీద వీర విహారం చేసే ప్లేయర్లు.. పాకిస్తాన్ ప్రత్యర్థిగా ఎదురు కాగానే భయపడిపోతున్నారు. వారి బౌలింగ్ ముందు నిలబడలేక.. వారి బ్యాటింగ్ ను తట్టుకోలేక చుచ్చు పోసుకుంటున్నారు. ఇటీవల టోర్నీలో అండర్ 19 జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది.. ఇప్పుడు జరుగుతున్న ఆసియా కప్ లో కూడా అదే ధోరణి కొనసాగిస్తోంది.
పాకిస్తాన్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత ఏకంగా 191 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడం సగటు భారత అభిమానిని కలవర పాటుకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్లో ముందుగా పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. 8 వికెట్ల కోల్పోయి 347 రన్స్ సాధించింది. పాకిస్తాన్ ఓపెనర్ సమీర్ 172 పరుగులు చేశాడు. 113 బంతులు ఎదుర్కొన్న అతడు 17 ఫోర్లు, 9 సిక్సర్లతో వీర విహారం చేశాడు. అహ్మద్ 56, ఉస్మాన్ ఖాన్ 35 పరుగులతో సత్తా చాటారు. దీపేష్ 3, కిలాన్, హెనిల్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ రెండో వికెట్ కు 92, మూడో వికెట్ కు 137 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేయడంతో భారీ స్కోర్ చేసింది.
పాకిస్తాన్ విధించిన 348 రన్ టార్గెట్ చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన భారత జట్టు.. ఏ దశలో కూడా లక్ష్యాన్ని చేరుకునే విధంగా కనిపించలేదు. 28.2 ఓవర్లలో 156 పరుగులకు టీమిండియా కుప్పకూలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పది బంతులలో 26 పరుగులు చేసినప్పటికీ.. అలీ రాజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆయుష్ మాత్రే(2), విహాన్ మల్హోత్రా (7), ఆరోన్ జార్జ్(16), వేదాంత త్రివేది (9), అభిజ్ఞాన్ కుందు (13), కనిష్ చౌహాన్ (9), కిలాన్ పటేల్ (19), హెనీల్ పటేల్ (19) విఫలమయ్యారు. చివర్లో దీపేష్ దేవేంద్రన్ (36) సత్తా చూపించడంతో టీమ్ ఇండియా ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది. ఇక ఎక్స్ట్రాల రూపంలో పాకిస్తాన్ బౌలర్లు 10 పరుగులు ఇచ్చారు. లేకపోతే టీం ఇండియా స్కోర్ మరింత దారుణంగా ఉండేది. పాకిస్తాన్ బౌలర్లలో అలీ రాజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. సాయం, సుభాన్, ఆషాన్ తలా రెండు వికెట్లు సాధించారు.
పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం పట్ల నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. “మొన్ననే ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఓడిపోయారు. పాకిస్తాన్ జట్టును చూడగానే మీకేమైనా అనిపిస్తోందా? ఏమైనా ఇబ్బంది కలుగుతోందా? ఇలాంటి స్థితిలో ఏం గెలుస్తారు? ముందుగా మీరు మానసిక దృక్పథాన్ని పెంపొందించుకోండి.. ఆ తర్వాత మైదానంలోకి అడుగుపెట్టండి. ఇలా వరుసగా ఓడిపోతూ ఉంటే మా ఇజ్జత్ మొత్తం పోతుందని” నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
Vaibhav Suryavanshi in U19 Asia Cup –
171 (95) vs UAE
5 (6) vs Pakistan
50 (26) vs Maleshiya
9 (6) vs Sri Lanka
26 (10) vs Pak in finalOnly 2 good knocks and both against minnows, Hopefully he will make the comeback and will score in major games pic.twitter.com/Uk8cKPPkqw
— Tejash (@Tejashyyyyy) December 21, 2025